»   » వర్మ ట్వీట్స్: మహేష్ బాబుపై ప్రశంసలు, బాహుబలిపై పంచ్

వర్మ ట్వీట్స్: మహేష్ బాబుపై ప్రశంసలు, బాహుబలిపై పంచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విషయం ఏదైనా సోషల్ మీడియా ద్వారా తనదైన రీతిలో రెచ్చిపోయే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన మనసులో ఉన్న భావాన్ని నిక్కచ్చిగా, కుండ బద్దలు కొట్టినట్లు చెబుతారు. తాజాగా విడుదలైన మహేష్ బాబు మూవీ ‘శ్రీమంతుడు' సినిమాపై కూడా వర్మ స్పందించారు.

‘శ్రీమంతుడు' మూవీ భారీ విజయం సాధించే అవకాశం ఉంది, సింపుల్ అండ్ ప్లేన్ మూవీ అంటూ అకాశానికి ఎత్తేసారు వర్మ. బాహుబలి లాంటి భారీ సినిమా చూసిన తర్వాత.... శ్రీమంతుడు సినిమా సింప్లిసిటీతో మనసుకు హత్తుకుందని, సినిమా అద్భుతంగా ఉదంటూ వర్మ ట్వీట్ చేసారు.


RGV tweet about Srimanthudu

వందల కోట్లతో వందలాది రోజులు షూటింగ్ చేస్తేనే కాదు... సింపుల్ స్టోరీ, ప్లెయిన్ క్లోజప్స్ తో కూడా మాయ చేయవచ్చని శ్రీమంతుడు సినిమా రుజువు చేసిందని వర్మ పేర్కొన్నారు. ఇలా అనడం ద్వారా ‘బాహుబలి' సినిమాపై పంచ్ వేసాడు వర్మ.


చార్మింగ్ ఉన్న నటుడు క్లోజప్ తో నటిస్తే అంతకంటే అద్భుతమైన విజువల్ ఏమీ ఉండదని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విటోరియో స్టొరారో చెప్పారని, మహేష్ బాబు అందుకు చక్కటి ఉదాహరణ అని వర్మ పేర్కొన్నారు.

English summary
"So soon after extravaganza of Bahubali,Srimanthudu simplicity told with heart also can create thundering impact is a greater achievement" RGV tweet about Srimanthudu.
Please Wait while comments are loading...