»   » మెగా క్యాంప్ హీరోలని టార్గెట్ చేసిన వర్మ

మెగా క్యాంప్ హీరోలని టార్గెట్ చేసిన వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిన్న రాత్రి జరిగిన లోఫర్ ఆడియో పంక్షన్ కి హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన వరుణ్ తేజని ఉద్దేశించి ట్వీట్స్ వరస పెట్టి చేసారు. ఆ ట్వీట్స్ లో వరుణ్ తేజని పొడుగుతూ మరో ప్రక్క మెగా క్యాంప్ హీరోలపై విమర్శలు చేసారు.అవి వేరెవరోనో టార్గెట్ చేసినట్లు కనపడుతోంది. మీరే చూడండి ..ఆ ట్వీట్స్ ని ఇక్కడ


వరుణ్ తేజలో నాకు నచ్చే విషయం అతను...మెగా ట్రీ నుంచి వచ్చే ఎలక్ట్రిక్ పరవ్ మీద ఆధారపడకుండా..తన సొంత సోలార్ బ్యాటరీని ఏర్పాటు చేసుకున్నాడు.

RGV tweet about Varun Teja and Mega Family

తన తల్లి చెట్టు నుంచి వచ్చే ఎలక్ట్రసిటీ మీద ఆధారపడేవారు...పవర్ లెస్ గా మిగులుతారు..స్టార్ పవర్ అనేది..పవర్ స్టార్ మీద లేదా మెగా ఎలక్ట్రసిటీ మీద ఆధారపడదు అన్నారు.

వరుణ్ తేజ...చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్మే బ్యాచ్ కాదు...చెట్టుకు గౌరవమిస్తాడు కానీ కొమ్మలాగ బ్రతకటం కోరుకోడు అన్నారు.

వరుణ్‌ తేజ్‌, దిశా పఠాని జంటగా నటించిన చిత్రం 'లోఫర్‌'. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆడియోను సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో విడుదల చేశారు. ముఖ్య అథితులుగా హీరో ప్రభాస్‌, దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ హాజరై సీడీని ఆవిష్కరించారు.

English summary
RGV tweeted:" What I like about Varun Tej is that he doesn't depend on his electric power from the Mega tree and has his own solar battery.Depending upon mother tree's electricity will make one powerless..Star power is about not depending on PowerStar and Mega electricity. Varun tej chettu Peru cheppukuni kaayalamme batch kaadhu ..chettuki gauravamisthadu kaani komma laaga bathakadam korukodu "
Please Wait while comments are loading...