twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ గోపాల్ వర్మ సెటైర్లు చిరంజీవిని ఉద్దేశించేనా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ వ్యాఖ్యల ద్వారా వార్తల్లోకి ఎక్కారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చిరంజీవిపై పరోక్ష విమర్శలే అని అంటున్నారంతా. పవన్ కళ్యాణ్ ను అర్థం చేసుకోవడం ఎలా? అనే అంశంలో అన్ని పార్టీల లీడర్లు కోచింగ్ తీసుకోవాలని, కనీసం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయకుండా ఉండటానికైనా వారికి కోచింగ్ అవసరమని వ్యాఖ్యానించారు.

    ఇటీవల పవన్ కళ్యాణ్ 'జన సేన' పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంపై ఇతర పార్టీల నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు మండి పడ్డారు. పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి కూడా పవన్ భావోద్వేగం, ఎజెండా ఏమిటో అర్థం కాలేదని వ్యాఖ్యానించారు.

    RGV tweet: How to Understand Pawan Kalyan?

    కాంగ్రెస్ హటావో-దేశ బచావ్ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి మాట్లాడుతూ....కాంగ్రెస్ పార్టీకి 125 ఏళ్ల చరిత్ర ఉంది. గతంలో ఎంతో మంది బంగాళాఖాతంలో కలిపేస్తాం. భూస్థాపితం చేస్తామన్నారు. అధి సాధ్యమైందా? అంటూ అని చిరంజీవి ప్రశ్నించారు.

    రామ్ గోపాల్ వర్మ ఇంతకు ముందు చేసిన ట్వీట్స్

    నాకు దేవుడిపై నమ్మకం లేదు. కానీ పవన్ కళ్యాణ్ దేవుడిలా కనిపిస్తున్నారు. తెలుగు ప్రజలకు మొదడు ఉంటే బాలాజీ, సాయిబాబా లాంటి వారిని వదిలేసి పవన్ కళ్యాణ్‌ను పూజించండి' అంటూ ట్వీట్ చేసాడు.

    జన సేన కంటే గొప్ప పేరు ఒక పార్టీకి ఉండే అవకాశం లేదు. శివ సేన కన్న 1000 రెట్లు బెటర్. పేరులోనే ఇంతుంటే పార్టీలో ఎంతుంటుందో. ప్రజారాజ్యం‌లో జరిగిన అవకతవక పనులు జనసేన పార్టీలో అసలు జరుగవని చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. పవన్ కన్నా గొప్ప నాయకుడు దొరకడు కనుక జనసేన పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించే తెలివి తెలుగువాళ్లకి ఉందని ఆశిస్తున్నాను' అంటూ వర్మ ట్వీట్ చేసారు.

    'నా ఉద్దేశ్యంలో తెలివి, నీతి, అభిమానం, పౌరుషం ఉన్నవాడెవడైనా సరే కేవలం పవన్ కళ్యాణ్ జనసేనకే ఓటు వేస్తాడు. జన సేన కేవలం కొత్తగా వస్తున్న ఇంకో పార్టీ అనుకుంటే బుద్ది తక్కువ మూర్ఖత్వం, జనసేన జనం కోసం, పవన్ సేన సృష్టిస్తున్న ఒక ప్రభంజనం' అని వర్మ వ్యాఖ్యానించారు.

    English summary
    "All leaders shud take coaching lessons on"How to Understand Pawan Kalyan ?. atleast then thy won't mke such ignorant comments on his speech" Ram Gopal Varma tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X