»   » 'అఖిల్‌' గురించి వర్మ ట్వీటాడు

'అఖిల్‌' గురించి వర్మ ట్వీటాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అఖిల్, సె వి.వి.వినాయక్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ఫస్ట్‌లుక్ టైటిల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితా రెడ్డి సమర్పణలో నితిన్ నిర్మిస్తున్న భారీ చిత్రం పేరు ‘అఖిల్' అని ఖరారు చేసి ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. ఆగస్ట్ 29న తండ్రి అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా రెండు రోజుల ముందుగానే అక్కినేని అభిమానులకు ఈ లుక్‌ను విడుదల చేశారు. ఈ నేపధ్యంలో ఎప్పటిలా రామ్ గోపాల్ వర్మ చిత్రం గురించి ట్వీట్ చేసాడు. ఆ ట్వీట్ ఏమిటంటే....

మొదట ఈ చిత్రానికి 'మిస్సైల్‌' అనే పేరు పెడతారని చెప్పుకొన్నారు. అయితే అఖరికి అఖిల్‌ సినిమా పేరు 'అఖిల్‌'గా ఫిక్సయ్యింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ధ్రువీకరించింది. 'పవర్‌ ఆఫ్‌ జువా' అనేది ట్యాగ్ లైన్. జువా అంటే సూర్యుడు అని అర్థం. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే కథ ఇది. టైటిల్‌తో పోస్టర్‌ని కూడా సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్‌లో విడుదల చేశారు. చేతిలో మండే గోళం పట్టుకొన్న అఖిల్‌.. పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు. నితిన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు తుది దశకు చేరుకొంది. అక్టోబరు 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ చిత్రం లేటెస్ట్ ఇన్ఫో..

RGV tweeted on Akhil's First Look

మూడు పాటలు మినహా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 12 వరకు యూరప్‌లో రెండు పాటలు చిత్రీకరిస్తారు. సెప్టెంబర్ 18 నుంచి 23 వరకు హైదరాబాద్‌లో భారీ సెట్స్‌లో చివరి పాట చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తవుతుందని చిత్ర నిర్మాత నితిన్ ఇటీవల తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా సెప్టెంబర్ 20న ఈ చిత్ర ఆడియో వేడుక చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేశారు. అక్టోబర్ 21 విజయదశమి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అఖిల్ అక్కినేని, సయేషా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, హేమ తదితరులు నటిస్తున్నారు.

English summary
Ram Gopal Varma ‏tweeted:" Someone who saw Akhil's rushes told me al Mega,super,power rebel,crazy stars hav 2 look for alternative professions like farming cooking etc"
Please Wait while comments are loading...