»   » ఈ సారి వర్మకు నితిన్ దొరికిపోయాడు...ఆడేసుకున్నాడు

ఈ సారి వర్మకు నితిన్ దొరికిపోయాడు...ఆడేసుకున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదారాబాద్ : అవును...ఈ సారి రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ దెబ్బకు నితిన్ టార్గెట్ అయ్యారు. ఆయన మిడ్ నైట్ డ్రింక్ చేసి చేసే ట్వీట్స్ లో నితిన్ ఈ సారి హాట్ టాపిక్ అయ్యారు. ప్రతీ రాత్రి వర్మ ..ఏదో ఒక టాపిక్ తో ముందుకు వస్తూండటం తెలిసిందే. ఈ సారి...వరసగా నితిన్ సినిమా ప్రాజెక్టు కాన్సిల్ కావటంతో కాస్తంత వ్యంగ్యం జోడించి వదిలాడు. ఆ ట్వీట్స్ లో ఏముందు..ఏం ట్వీట్స్ చేసారు అనేది క్రింద స్లైడ్ షోలో చూడండి. ఈ లోగా...నేపధ్యం చదవండి.

వివరాల్లోకి వెళితే.. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో నితిన్‌తో ఓ కొత్త సినిమాను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ‘హార్ట్ అటాక్' తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందే సినిమా కావడంతో ఈ సినిమాపై అనౌన్స్ అయిన రోజునుంచే మంచి అంచనాలున్నాయి. అయితే సడెన్‌గా ఈ సినిమా ఆగిపోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తై, ఈ నెల 15న సెట్స్‌పైకి వెళ్ళాల్సిన సినిమా ఇలా అకస్మాత్తుగా ఆగిపోవడం అందరికీ షాక్ ఇచ్చింది. వర్మ కు మాత్రం ఇందులో ట్వీట్స్ ద్వారా ఫన్ వెతుక్కునేలా చేసింది.

ఇక ఈ సినిమా ఆగిపోయిందన్న విషయాన్ని పూరీ జగన్నాథ్, నితిన్‌లు విడివిడిగా తమ ట్విట్టర్ ఎకౌంట్‌లలో తెలిపారు. తాను నితిన్‌తో ప్లాన్ చేసిన సినిమా క్యాన్సిల్ అయిందని, వేరొక హీరోతో ఇంతకుముందు తెలియజేసిన రోజునుంచే షూటింగ్ మొదలుకానుందని పూరీ తెలిపారు. ఇక నితిన్ సైతం తన ట్విట్టర్‌ ఎకౌంట్‌లో సినిమా ఆగిపోయిందన్న విషయాన్ని తెలియజేశారు. "పూరీ గారితో ప్లాన్ చేసిన సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. భవిష్యత్‌లో ఆయనతో మళ్ళీ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నా" అంటూ నితిన్ సినిమా ఆగిపోయిన విషయాన్ని తెలిపారు.

ఇప్పుడే విన్నా...

ఇప్పుడే విన్నా...

పూరి కొత్త స్క్రిప్టు... విషయమై నితన్ చెప్పినదాన్ని పూర్తిగా ఒఫ్పుకుంటున్నాను. అది ఒక పూర్తి ప్యాకెడ్ హార్ట్ టచింగ్ ..ఫుల్ ఎంటర్టైనర్

ఓహ్ సారీ

ఓహ్ సారీ

అయ్యో..సారీ సారీ...ఇప్పుడే పూరి జగన్ ద్వారా విన్నాను..నితన్ ని రీ ప్లేస్ చేస్తున్నాడని...

తెలియదు కానీ

తెలియదు కానీ

పూరి జగన్నాధ్ ఇలా నితన్ మార్చడానికి కారణం నాకు తెలియదు కానీ... కథ ప్రకారం ఎవరినయితే పూరి జగన్నాధ్ ఎంపిక చేసారో... ఆ నటులు మంచి అదృష్టవంతులే

సంతోషపడుతున్నా

సంతోషపడుతున్నా

నితిన్ చెయ్యాల్సిన చిత్రాన్ని పూరి వేరే వారితో ఇమ్మిడియట్ గా ప్రారభించటాన్ని నేను చాలా ఆనందపడుతున్నా... ఎందుకంటే సాధ్యమైనంత తొందరలో ఓ ప్రేక్షకుడుగా ఆ సినిమాని చూడాలనుకుంటున్నా.

ఇప్పుడే...

ఇప్పుడే...

జస్ట్ ఇప్పుడే...పూరి జగన్నాథ్ చెప్పారు...ఎందుకు నితిన్ ని రీ ప్లేస్ చేసారు అనేది...ఎందుకంటే కథ ప్రకారం ఆయన వరుణ్ తేజ లాంటి యువకుడుతో ముందుకువెల్లాలకుంటున్నానని ..నేను అనుకుంటున్నా అదురుతుందని...

పూరి ఏమంటారు అంటే...

పూరి ఏమంటారు అంటే...

.." నేను నితిన్ తో చేద్దామనుకున్న ప్రాజెక్టుని వేరే హీరోతో చేస్తున్నాను. అదే రోజున షూటింగ్ ప్రారంభమవుతుంది..మిగతా వివరాలు త్వరలో తెలియచేస్తాను "

నితిన్ ఏమంటారంటే....

నితిన్ ఏమంటారంటే....

కొన్ని అనివార్య కారణాల వల్ల పూరి జగన్నాధ్ గారితో నేను చేయాల్సిన సినిమాను ఆపేస్తున్నాం. ప్యూచర్ లో ఆయనతో పనిచేస్తానని ఆశిస్తున్నాను అని ట్విట్ చేసారు. ఆ ట్వీట్ మీరూ చూడండి.

English summary
Check out the tweets above and you would also agree with us that Ram Gopal Varma tried to pull a leg of Nithin. But the only thing we shall know is, why?
Please Wait while comments are loading...