»   » వర్మ వివాదాస్పద వ్యాఖ్యలే కాదు...ఈ సారి ఫొటోలు కూడా

వర్మ వివాదాస్పద వ్యాఖ్యలే కాదు...ఈ సారి ఫొటోలు కూడా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వివాదం ఎక్కడుంటే అక్కడ వర్మ వాలిపోతాడు. ఇప్పుడు దేశమంతటా వివాదం రేపుతున్న మ్యాగి పై వర్మ పడ్డారు. ఆయన మ్యాగీ విషయమై ఆయన ఉదయమే మళ్లీ ట్వీట్స్ చేసారు. అంతేకాకుండా మ్యాగీ తింటున్న ఫొటోలు నాలుగైదు అప్ లోడ్ చేసారు. మ్యాగీ తింటూ ఆనందంగా,తన్మయంగా ఆయన కనపడే ఫోటోలు చూసిన వారు..ఇప్పుడు ఆయన ఆ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారారా అంటున్నారు. వర్మకు అత్యంత ఇష్టమైన ఫుడ్ మ్యాగీ అన్నట్లు ఆయన ఫోజుల ఇచ్చారు. అంతేకాకుండా... ఈ క్రింద విధంగా ట్వీట్ చేసారు.

RGV tweets on Maagi


ఈ ట్వీట్ లో... మ్యాగీ ని మించిన ఆనందం నాకు ఏదీ ఇవ్వదు. మ్యాగీ తింటూ నేను మరణిస్తే...నా చివరి కోరిక ఏమిటీ అంటే...మ్యాగీ ని నా ఫ్యూరనల్ కు తీసుకురావాలి. ఎందుకంటే నాకు మ్యాగీ మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఇంతకుముందు కూడా...

మాగి నూడుల్స్ మీద దేశ వ్యాప్తంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హానికారక రసాయనాలు ఉన్నాయంటూ పలు రాష్ట్రాల్లో వీటిని బ్యాన్ చేసారు కూడా. అయితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం మాగీకి మద్దతుగా నిలిచాడు. అంతే కాదు...తిరుపతి లడ్డూను ఎవరైనా టెస్ట్ చేయగలరా? రోడ్డు పక్కన ఉండే వందలాది హోటల్స్ మీద బ్యాన్ చేయగలరా?...ఎంఎన్‌సి కంపెనీలను సాఫ్ట్ టార్గెట్ చేస్తున్నారు... అంటూ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

RGV tweets on Maagi

అత్యంత ప్రమాదకరం అయిన సిగరెట్లు, ఆల్కహాల్ విచ్చలవిడిగా అమ్ముతున్నారు. వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. మాగీ మీద మాత్రం బ్యాన్ విధించారు. సూపర్బ్ అంటూ వర్మ ట్వీట్ చేసారు.

వర్మ సినిమాల విషయానికొస్తే... సచిన్ జోషి కథానాయకుడిగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మొగలిపువ్వు'. మీరా చోప్రా, కైనత్ అరోరా కథానాయికలు. జెడ్3 పిక్చర్స్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జీత్ గంగూలీ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోలాండ్ లో చిత్రీకరణ జరుపుకుటుంది. సీజర్ గొంజాలేస్ కోరియోగ్రఫీలో సచిన్ జోషి, మీరా చోప్రాలపై ఇటివలే ఓ శృంగారాత్మక గీతాన్ని తెరకెక్కించారు. వర్మ మార్క్ రొమాంటిక్ టచ్ ఈ గీతానికి ప్రత్యేక ఆకర్షణ.

ఓ సినిమా చిత్రీకరణ కోసం పదిహేనేళ్ళ తర్వాత వర్మ విదేశాలకు వెళ్ళడం విశేషం. చివరిసారిగా 2000లో 'మస్త్' చిత్రంలో పాటల చిత్రీకరణకు విదేశాలు వెళ్ళారు. ఆ తర్వాత 'మొగలిపువ్వు' వర్మను విదేశాలకు తీసుకెళ్ళింది. వివాహిత వ్యక్తి ఓ మహిళతో పెట్టుకున్న సంబంధం ఎంత దూరం వెళ్ళింది. అక్రమ సంబంధాలు, వాటిలో సెల్ ఫోన్ పాత్ర ఎంతుంది అనే పాయింట్ మీద వర్మ థ్రిల్లర్ నేపధ్యంలో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. 'ప్రతి పెళ్ళైన మగాడి సెల్ ఫోనులో భార్యకు తెలియని సీక్రెట్ ఉంటుంది' అంటూ సెల్ ఫోనును విలన్ చేసేశారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.

English summary
RGV tweeted: "Nothing ever made me more happy than Maggi. If I die of eating Maggi my last will is only Maggi shud come to my funeral cos it gave happiness till I died nd its banners gave me nothing"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu