»   » రామ్ గోపాల్ వర్మ అభిమానులకు శుభవార్త

రామ్ గోపాల్ వర్మ అభిమానులకు శుభవార్త

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ త్వరలో భూ...అనే టైటిల్ తో మరో హర్రర్ చిత్రం తెరకెక్కించనున్నారు. అది హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఉండనుందని తెలుస్తోంది. ఈ విషయమై ఆయన రీసెంట్ గా ట్వీట్ చేస్తూ...ఈ కొత్త హర్రర్ చిత్రం విషయమై చాలా ఎక్సైట్మెంట్ తో ఎదరుచూస్తున్నాను. ఆ సినిమా భూ. భూత్ కి సిక్వెల్ లాంటిది. ఇక భూ అనే టైటిల్ చిన్న పిల్లలు ఎక్కువగా ఉపయోగిస్తూంటారు.వాళ్ళు చీకటిని చూసి చెప్పే మాట అది. ఈ చిత్రం ట్యాగ్ లైన్ భూత్ మిమ్మల్ని భయపెడితే...భూత్ మిమ్మల్ని చంపేస్తుంది. నా రాత్, భూత్, ఫూంక్ తర్వాత వస్తున్న ఈ చిత్రం మిమ్మల్ని భయపెడుతుంది అన్నారు. ఇక ఈ చిత్రం చిన్న పిల్లలు సెంట్రల్ గా ఉండబోతోందని సమాచారం. ఫూంక్ చిత్రం తర్వాత వచ్చిన ఫూంక్ తర్వాత డైరక్ట్ చేస్తున్న చిత్రం ఇది. భయపెడుతుందో, నవ్వులతో చంపేస్తుందో చూడాల్సిందే.

English summary
RGV tweeted : “Am very excited about this new horror film I am starting..its title is.. "BHHOOoo.!" This will be BHOOT 2.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu