»   » 'రావణ్‌' ని రీమేక్ చేస్తా: రామ్ గోపాల్ వర్మ

'రావణ్‌' ని రీమేక్ చేస్తా: రామ్ గోపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఘోరంగా ఫెయిలైన మణిరత్నం తాజా చిత్రం 'రావణ్‌'ను 'మై నేమ్‌ ఈజ్‌ రావణ్‌' పేరుతో రీమేక్‌ చేస్తానని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. అంతేగాక నిర్మాతగా కరణ్‌ జోహార్‌ వ్యవహరించాలని ప్రతిపాదించాడు. అయితే ఇదంతా ట్వట్టర్ లో రామ్ గోపాల్ వర్మ విసురుతున్న వ్యంగ్య బాణాలు. మరో ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ తో ట్విట్టర్ లో సంభాషిస్తూ రాము ఇలా ట్వీట్ చేసారు...'నాకో మంచి ఐడియా వచ్చింది. నేను మై నేమ్‌ ఈజ్‌ రావణ్‌ చేస్తా. నా ఆగ్ ‌ను రీమేక్‌ చేయాల్సిందిగా మణిరత్నంను కోరుతానని సందేశం పంపాడు.

అయితే దీనికి కరణ్‌ స్పందిస్తూ...'రామూ! నీకు మంచి సెన్సాఫ్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఉంది. కానీ ఇది నీ సినిమాల్లో కనిపించదు!' అని వ్యంగ్యంగా ట్వీట్ చేసారు. దానికి వర్మ కౌంటర్ గా 'కరెక్ట్‌ కరణ్‌! ఎప్పుడూ విమర్శలే ఎదుర్కుంటాను కాబట్టి హాస్యం అలవాటు చేసుకున్నాను' అని బదులిచ్చాడు. అలాగే రాము మరోసారి ట్వీట్ చేస్తూ...తన సినిమాలు పరాజయం పాలైనా, ఇతరులవి పరాజయం పాలైనా తానే బాధ్యత వహించాల్సి వస్తోందంటూ రాము వాపోయాడు.

ఎందుకంటే ఏ సినిమా సరిగా ఆడకున్నా దానిని చాలా మంది రాము 'ఆగ్‌'తో పోలుస్తున్నారు. తషాన్‌ ఫ్లాప్ అయినప్పుడు దాన్ని ఆదిత్యకీ ఆగ్ ‌గా అభివర్ణించారు. చాందినీ చౌక్‌ పరాజయం పాలైనప్పుడు..అక్షయ్‌ కీ ఆగ్‌ అని పేరు పెట్టారు. అలా ఫ్లాప్‌ లకు బెంచ్‌ మార్క్ ని నిర్ణయించిన ఘనత తనకే దక్కిందని రాము అన్నారు. అంతేకాదు వీటన్నిటిని బట్టి చూస్తే షోలే కంటే తన ఆగే బాగా పాపులర్‌ అయిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అదీ సంగతి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu