»   » ‘వంగవీటి’ రచ్చ : వర్మ ఎందుకీ ట్వీట్ చేసినట్లు

‘వంగవీటి’ రచ్చ : వర్మ ఎందుకీ ట్వీట్ చేసినట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ . తెలుగులో తన ఆఖరి చిత్రంగా ‘వంగవీటి'ని రూపొందిస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం ఈ నెల 26న విజయవాడకు వెళ్లనున్ననంటూ ట్వీట్ చేసారు. ఆయన విజయవాడ వెళ్తే వెళ్ళారు..పని గట్టుకుని మరీ ట్వీట్ చేసి ప్రపంచానికి తెలియచేయటంలో అంతరార్దం ఏమటి అంటున్నారు.

ఈ ట్వీట్ చేయటం ద్వారా ఆయన సినిమాను లైవ్ లో ఉంచటానికా లేక..విజయవాడ పొలిటీషన్స్ ఆ సమయానికి ఎలర్ట్ చేయటాని కా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్ ద్వారా ఆయన ఏదన్నా వివాదం ఆశిస్తున్నారా అనే సందేహం అందరిలో కలుగుతోంది.

Also Read: వర్మ 'వంగవీటి' సినిమా: 'గాయం' సినిమాలో రంగా క్యారెక్టర్ ఇలా...

సినిమాలో 30 ఏళ్ల కిందటి బెజవాడ పరిస్థితులను వర్మ ఈ చిత్రంలో చూపించనున్నారు. అయితే ఈ సినిమా కథకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకునేందుకు తాను విజయవాడ వెళ్లి పలువురిని కలవనున్నట్లు వర్మ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో అయినా, నేను నిజంగా పుట్టి పెరిగింది విజయవాడలో... ఎందుకంటే నాకు అవగాహన,తెలివి, బంధాలు, స్నేహాలు, ప్రేమించుకోవడాలు, చంపుకోవడాలు వీటన్నింటి గురించి తెలిసింది విజయవాడలోనే. నేను అనంతపురం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీసిన రక్త చరిత్రకి ఇప్పుడు విజయవాడ రౌడీయిజం బ్యాక్ డ్రాప్ లో తీయబోతున్న "వంగవీటికి" ముఖ్యమైన తేడా పగకి, ఆవేశానికి ఉన్న తేడా.

RGV will go to Vijayawada on 26th

అలాంటి రౌడీయిజం రూపాన్ని, దాని ఆంతర్యాన్ని 30 ఏళ్ళ క్రితం నేను విజయవాడ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నప్పుడు,బాగా దగ్గరగా స్వయంగా నా కళ్ళతో చూశాను ... అందుకనే విజయవాడ రౌడీయిజం గురించి నాకన్నా ఎక్కువ తెలిసిన వాడు, విజయవాడలో కూడా లేడని బల్ల గుద్దే కాకుండా కత్తితో కూడా పొడిచి చెప్పగలను. "వంగవీటి" చిత్రం తెలుగులో నా ఆఖరి చిత్రం అవుతుంది..

"శివ" తో మొదలైన నా తెలుగు సినిమా ప్రయాణం "వంగవీటి"తో ముగించాలని నేను తీసుకున్న నిర్ణయానికి కారణం "వంగవీటి" కన్నా అత్యంత నిజమైన మహా గొప్ప కథ మళ్ళీ నాకు జీవితంలో దొరకదని నాకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి. అని తెలిపారు.

English summary
Ram Gopal Varma tweeted: Going to Vijayawada on 26th to meet some people for the research on "Vangaveeti"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu