»   » 'లీడర్‌' ఆఫర్ నా లక్..హీరోయిన్ రిచా

'లీడర్‌' ఆఫర్ నా లక్..హీరోయిన్ రిచా

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొంతమంది హీరోయిన్స్ కు ఎన్నో ఏళ్లు గడిచినా 'లీడర్‌'లాంటి సినిమాలో నటించే అవకాశం రాదు. అలాంటిది తొలి చిత్రంతోనే నాకు అంత గొప్ప అవకాశం రావడం నా లక్‌ అనుకుంటున్నాను అంటోంది రిచా గంగోపాధ్యాయ. ఆమె నిన్న(శుక్రవారం) రిలీజైన శేఖర్ కమ్ముల 'లీడర్‌'లో రాణా సరసన హీరోయిన్ గా చేసింది.ఆ విశేషాలు మీడియాతో పంచుకుంటూ...'లీడర్‌'లాంటి గొప్ప చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రని చేయడం సంతృప్తినిచ్చింది. హీరోయిన్ గా నాకు ఈ చిత్రం 'గుడ్‌ లాంచింగ్‌' అయ్యింది. ఫస్ట్‌ సినిమానే బెస్ట్‌ సినిమా చేయడం ఆనందంగా ఉంది అంటోంది. అలాగే మా కుటుంబంలో సినిమాకి సంబంధించినవారెవ్వరూ లేరు. నేను కొన్ని యాడ్స్‌లో నటించాను.

'లీడర్‌'లో నటించకముందు నటిగా నాకున్న అనుభవం అది. కానీ ఈ సినిమా మొదటి రోజు షూటింగ్‌లో పాల్గొనగానే యాడ్స్‌ వేరు సినిమా వేరు అనిపించింది అంది. ఇక ఈ సినిమా అవకాశం రావటం గురించి మాట్లాడుతూ...2007లో 'మిస్‌ ఇండియా యుఎస్‌ఎ' బిరుదు సొంతం చేసుకున్నాను. ఒకసారి మా బంధువులను కలవడానికి ఇండియా వచ్చినప్పుడు ఇక్కడి దర్శక, నిర్మాతలను కలిస్తే ఎంకరేజింగ్‌ గా మాట్లాడారు. ఆ తర్వాత సినిమాల పట్ల ఇష్టం ఆరంభమైంది. ఒకప్పుడు బంధువులను చూడటానికి ఇండియా వస్తే ఈసారి సినిమా నటిగా ఇక్కడ కాలుపెట్టాను. ఆ క్షణంలో జీవితం ఎంత విచిత్రమైనది అనిపించింది అంటోంది ఈ ముద్దుగుమ్మ.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu