»   » ఆమె బర్త్ డే కి టాలీవుడ్ ప్రముఖులంతా...

ఆమె బర్త్ డే కి టాలీవుడ్ ప్రముఖులంతా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

లీడర్ లో రాణా సరసన చేసిన రిచా గంగోపాధ్యాయ పుట్టినరోజు వేడుకలు జూబ్లిహిల్స్ లోని ఓ పబ్ లో జరిగాయి. ఆ వేడుకలకు టాలీవుడ్ ప్రముఖులంతా తరలి వచ్చారు. పింక్ డ్రస్ లో ప్రత్యేకంగా తయారై వచ్చిన ఆమెకు యువరాణిలా వెలిగిపోయింది. నాగార్జున, అమల, పూరీ జగన్నాధ్, రవితేజ, సురేష్ బాబు, దర్శకుడు సూర్య ప్రకాశరావు,సుబ్బరాజు, ప్రియా ఆనంద్ వంటి వారు వచ్చి బర్తడె విసెష్ తెలియచేసారు. అలాగే రామ్ గోపాల్ వర్మ మేనల్లుడు సుమన్ వర్మ ప్రత్యేకార్షణగా నిలిచారు. ఒకే సినిమా వయస్సు ఉన్న ఈ బెంగాలీ అప్ కమింగ్ భామ బర్తెడే వేడుకలకు ఇండస్ట్రీ తరలి రావటం హాట్ టాపిక్ గా ఫిల్మ్ సర్కిల్స్ లో మారింది. ఇదంతా చూస్తూంటే రిచాకు ఇప్పుడు తెలుగు పరిశ్రమలో మంచి డిమాండ్ ఉన్నట్లే అని సీనియర్స్ వ్యాఖ్యానిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu