»   » ఆటోలో దూరి తప్పించుకున్న 'లీడర్' భామ

ఆటోలో దూరి తప్పించుకున్న 'లీడర్' భామ

Posted By:
Subscribe to Filmibeat Telugu

లీడర్ చిత్రంతో పరిచయమైన రిచా గంగోపాధ్యాయ రీసెంట్ గా ఓ ఆటోలో తలదాచుకోవాల్సిన పరిస్ధితి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ లో ఫొటో పెట్టి మరీ తెలియచేసింది. ఆ వివలాలు ఇలా ఉన్నాయి. రిచా ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో “మిరపకాయ్" చిత్రంలో నటిస్తోంది. ఈ అయితే ఆమె గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. అయినా కూడా అలాగే షూటింగులులకు హాజరవుతోంది. అయితే…"మిరపకాయ్" షూటింగ్ తాజా షెడ్యూల్ కొద్ది రోజుల క్రితం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో మొదలయ్యింది. శరవేగంగా జరుగుతోన్న ఈ సినిమా హూటింగులో రిచా ఎప్పటిలాగే నిన్న (సెప్టెంబరు 16) కూడా పాల్గొంది. ఉదయం నుండి ఏకధాటిగా జరుగుతున్న షూటింగ్ మధ్యాహ్నం భోజన విరామం తరువాత ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఆగిపోయింది. ఉన్నట్టుండి కుండపోతగా కురిసిన వర్షం నుండి తప్పించుకోవడానికి అక్కడే లోకేషన్ లో ఉన్న ఒక ఆటోలో దూరి రిచా తలదాచుకుంది. ఈ మ్యాటక్ ని రిచా స్వయంగా “ట్విట్టర్" లో పోస్ట్ చేసింది. జ్వరంలో ఉండి తడవకూడదనే పాయింట్ ఒకటి అయితే మేకప్ పోతే మళ్ళీ చేయించుకోవాలనేది ఇంకో ఇబ్బంది. ఇక రిచా..వెంకటేష్ సరసన చంద్రముఖి సీక్వెల్ లో కూడా చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu