»   » అంతా తనకోసం చూస్తూంటే సినిమాలు వదిలేసి.., పట్టాతో అక్కడ తేలింది

అంతా తనకోసం చూస్తూంటే సినిమాలు వదిలేసి.., పట్టాతో అక్కడ తేలింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రభాస్‌తో కొరటాల శివ తీసిన మిర్చి, మాస్ మహారాజ రవితేజ మిరపకాయ్ వంటి సినిమాలు రిచా గంగోపాధ్యాయ్‌కి సక్సెస్ ఇచ్చాయి. తెలుగులోనే కాకుండా తమిళంలో ధనుష్, శింబు లాంటి యంగ్ హీరోలతో సినిమాలు చేసింది. ఆ తర్వాత అసలు సినిమాలని తాను వృత్తిగా తీసుకోలేదని, క్యాజువల్‌గా ఆఫర్ రావడంతో హీరోయిన్ అయ్యానని క్లారిటీ ఇచ్చింది. తర్వాత ఇన్నాళ్ళకి తన ఎంబీయ్యే పట్టా తో మళ్ళీ కనిపించింది...

సినిమాలకు టాటా చెప్పేసింది

సినిమాలకు టాటా చెప్పేసింది

ఆఫర్లు లేవనుకుంటున్న టైమ్ లో మిర్చితో మాంఛి హిట్ కొట్టింది. ఇక ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తాయనుకున్న టైమ్ లో సినిమాలకు టాటా చెప్పేసింది. సినిమాల నుంచి తప్పుకుంటున్నాని సింపుల్ గా ట్విట్టర్ లో ఓ పోస్ట్ పడేసి... అమెరికా చెక్కేసింది. సినిమా అంటే సీరియస్‌గా తీసుకోలేదు కాబట్టే హీరోయిన్‌గా ఆఫర్స్ వున్నా చేయకుండా అమెరికా వెళ్ళిపోయింది.

మళ్ళీ ఒకసారి

మళ్ళీ ఒకసారి

ఆ తర్వాత క్రమంగా రిచా గురించిన వార్తలు తగ్గిపోయాయ్. టాలీవుడ్ కూడా రిచా మీద ఆశలు వదిలేసుకుంటున్న సమయం లో మళ్ళీ ఒకసారి వార్తల్లోకి ఎక్కేసిందీ బెంగాలీ భామ. తాజాగా గ్రాడ్యుయేట్ ప‌ట్టా అందుకుంద‌ట‌. ఈ విష‌యాన్ని ఆమే త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపింది.

వాషింగ్ట‌న్ యూనివ‌ర్సిటీ

వాషింగ్ట‌న్ యూనివ‌ర్సిటీ

సెయింట్ లూయిస్ లోని వాషింగ్ట‌న్ యూనివ‌ర్సిటీ నుండి తాను మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్(ఎం.బి.ఏ) ని స‌క్సెస్ ఫుల్‌గా పూర్తిచేశాన‌ని చెప్పింది. సినిమా నుంచి తప్పుకొని మరీ డిగ్రీ కోసమ్న్ వెళ్ళిపోయిందంటేనే తనకున్న ఫ్యాషన్ ఎంత ఉందో అర్థమైపోయింది.

కాఫీ షాపులో పనిచేస్తూ

కాఫీ షాపులో పనిచేస్తూ

అందుకే ఎంత సీరియస్ గా చదివిందంటే.. అక్కడే ఒక కాఫీ షాపులో పనిచేస్తూ అమ్మడు తన కోర్సును పూర్తి చేసిందట. ఆ డిగ్రీ చేతికి రాగానే ఇప్పుడు ఎగిరి గంతేస్తోంది. నా చేతిలో డిగ్రీ పెట్టారోచ్ అంటూ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. త‌న చ‌దువుకోసం విదేశాల్లోనే గ‌డిపిన ఈ అమ్మ‌డు ఇక త‌న చ‌దువు అయిపోయింది క‌నుక మ‌ళ్లీ నటన వైపు వస్తుందో లేదో చూడాలి మరి.

English summary
Richa Gangopadhyay has used her hibernation period to complete her MBA graduation from the prestigious Washington University. The lovely girl has also gushed that she is proud to have done so in the centennial year of Olin Business School.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu