టాలీవుడ్ కి ఎస్ బాలీవుడ్ కి నో చెప్పిన మిరపకాయ్ పోరి..!
మిరపకాయ్ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ కు అనుకొని ఆఫర్లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. లీడర్ సినిమా రిజల్ట్ బాగున్నా రిచా గంగోపాధ్యయకు పెద్దగా కలిసి రాలేదు. ఆ తరువాత చంద్రముఖి 2గా వచ్చిన నాగవల్లిలో మంచి పాత్రే చేసినా సినిమానే ఫ్లాప్ అవ్వడంతో ఈ అమ్మడి కెరీర్ ఎటు కాకుండా మిగిలిపోయింది. రవితేజ మిరపకాయ్ లో మాస్ హీరోయిన్ గా నిలబడటం కోసం కావలసినంత అందాలు ఆరోబిసినా ప్రయోజనం లేకుండా పోయింది.
దాంతో మూట ముళ్ళు సర్దేసుకుంటున్న టైంలో తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఈ అమ్మడికి ఆఫర్ వచ్చింది. అక్కడ కొంచెం అందం, కొంచెం నటన కలిపి తన స్టైల్ లో రిచా టాలెంట్ చూపించేసరికి తమిళ తంబీలు ఇంప్రెస్ అయిపోయారు." 'మాయక్కం ఎన్న" అనే తమిళ్ సినిమాలో ఈ అమ్మడి సోలో ఫెర్ఫామేన్స్ ఇరగదీసిందట. ఆ సినిమానే కాక రిచా నటించిన మరో మూడు సినిమాలు త్వరలో రిలీజ్ కాబోతున్నాయి. అందులో ఏ రెండు సినిమాలు హిట్ అయినా కూడా తమిళం లో ఈ భామ నిలదోక్కుకున్నట్టే. హిందీ దబాంగ్ కు తమిళ్ రీమేక్ గా రూపొందిన శింబు 'ఒస్తీ" కూడా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉందట రిచా. కోలీవుడ్ లో హిట్ అయిన తరువాత అయినా తెలుగులో ఈ అమ్మడికి మన వాళ్ళు ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.
ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో భూపతి పాండ్యన్ దర్శత్వంలో గోపిచంద్ హీరోగా రూపొందుతోన్న సినిమాలో రిచా గంగోపాధ్యాయ కథానాయికగా కమిట్ అయ్యింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'వారధి" చిత్రంలో రిచా ఓ కథానాయికగా నటిస్తోంది. కాగా రిచాకి 'షార్ట్ కట్ రోమియో" అనే హిందీ సినిమాలో నటించే అవకావం వచ్చింది. ఈ సినిమా కోసం 45రోజులు డేట్స్ కేటాయించమని రిచాని ఈ చిత్ర దర్శకుడు సుశీగణేషన్ అడిగాడట. అన్ని డేట్స్ హిందీ సినిమా కోసం ఇవ్వలేని రిచా డిసైడ్ అయ్యి ఈ అవకాశాన్ని తిరస్కరించిందని సమాచారం. ముందు కోలీవుడ్, టాలీవుడ్ ల్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలిన డిసైడ్ అయ్యే హిందీ సినిమాని వదులుకుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్...


Click it and Unblock the Notifications











