»   » సునీల్ విజిల్ ఊది...మోషన్ పోస్టర్ ని వదిలాడు

సునీల్ విజిల్ ఊది...మోషన్ పోస్టర్ ని వదిలాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సుమంత్ అశ్విన్ తాజా చిత్రం 'రైట్ రైట్'. మ‌ను ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స‌త్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై జె.వంశీకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.`బాహుబ‌లి` ఫేమ్ ప్ర‌భాక‌ర్ ఇందులో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. పూజా జ‌వేరి హీరోయిన్.

'రైట్ రైట్' సంస్థ ఆఫీస్ లో మోషన్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. సునీల్ విజిల్ ఊది, రైట్ రైట్ అంటూ వెరైటీగా మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఆ పోస్టర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ - ''నా చేతుల మీదగా ఈ పోస్టర్ విడుదల కావడం నా అదృష్టం. ఎమ్మెస్ రాజుగారి బేనర్లో 'మనసంతా నువ్వే'లో నేను చేసిన ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ నా కెరీర్ కి బలమైన పునాది అయ్యింది. ఆ సినిమా చేసినప్పట్నుంచీ సుమంత్ అశ్విన్ నాకు క్లోజ్. తనని తమ్ముడూ అని పిలుస్తాను.

బంగారంలాంటి కుర్రాడు. ఎమ్మెస్ రాజుగారు జస్ట్ స్టార్ నుంచి ఎందర్నో సూపర్ స్టార్స్ ని చేశారు. సుమంత్ అశ్విన్ కూడా స్టార్ హీరో కావాలని కోరుకుంటున్నాను. నా 'మర్యాద రామన్న'తో ప్రభాకర్ ఎంటరయ్యాడు. ఆ సినిమాలో అతన్ని చూస్తుంటే భయం వేసింది. ఈ సినిమాలో చూస్తుంటే లవ్ వస్తోంది. ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలి'' అని చెప్పారు.

Right Right Movie motion picture launch by suni

సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ - ''సునీల్ నాకు చిన్నప్పట్నుంచీ క్లోజ్. షూటింగ్ లొకేషన్లో తనని అబ్జర్వ్ చేసేవాణ్ణి. సునీల్ ఈ మోషన్ పోస్టర్ ని ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నా, ప్రభాకర్ కాంబినేషన్ కొత్తగా ఉంటుంది'' అన్నారు.

ప్రభాకర్ మాట్లాడుతూ - '' 'మర్యాద రామన్న'తో నా కెరీర్ ఆరంభం అయ్యింది. ఆ సినిమా అప్పుడు సునీల్ ఇచ్చిన సహకారాన్ని మర్చిపోలేను. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 'రైట్ రైట్' సినిమా నాకు మంచి బ్రేక్ అవుతుంది. ఈ చిత్రానికి అవకాశం ఇచ్చిన ఎమ్మెస్ రాజు గారికి, సుమంత్ అశ్విన్, దర్శకుడికి నా ధన్యవాదాలు'' అని చెప్పారు.

నిర్యాత జె. వంశీకృష్ణ మాట్లాడుతూ - ''ఈ నెల 22 నుంచి మార్చి 9 వరకు జరిగే షెడ్యూల్ తో ఒక పాట మినహా సినిమా పూర్తవుతుంది. ఏప్రిల్ లో పాటలను, మేలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని తెలిపారు.

నాజ‌ర్‌, ధ‌న‌రాజ్‌, `ష‌క‌ల‌క` శంక‌ర్‌, తాగుబోతు ర‌మేశ్‌, జీవా, రాజా ర‌వీంద్ర‌, భ‌ర‌త్‌రెడ్డి, వినోద్‌, పావ‌ని, క‌రుణ‌, జ‌య‌వాణి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జె.బి., పాట‌లు: శ్రీమ‌ణి, కెమెరా: శేఖ‌ర్ వి.జోస‌ఫ్‌, మాట‌లు: `డార్లింగ్‌` స్వామి, ఆర్ట్ : కె.ఎమ్‌.రాజీవ్‌, ఎడిటింగ్: ఎస్. బి. ఉద్ధవ్, కో-ప్రొడ్యూసర్: ఎం.వి. నరసింహులు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జె. శ్రీనివాసరాజు, నిర్మాత‌: జె.వంశీకృష్ణ‌, ద‌ర్శ‌క‌త్వం: మ‌ను.

English summary
Sunil said that he was very happy to launch the motion poster of Right Right film. Directed by Manu. produced by J. Vamsi Krishna. mmusic by J.B. starring: Sumanth Ashwin & Pooja Jhaveri.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu