»   » షట్ అప్..వేరే పని లేదా...ఇంకో మాట మాట్లాడితే బ్లాక్ చేస్తా...సీరియస్ వార్నింగ్

షట్ అప్..వేరే పని లేదా...ఇంకో మాట మాట్లాడితే బ్లాక్ చేస్తా...సీరియస్ వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్‌ జంట సైఫ్‌అలీ ఖాన్‌, కరీనా కపూర్‌లు తమ చిన్నారికి తైమూర్‌ అలీఖాన్‌ పటౌడీ అని పేరుపెట్టుకున్నారు. అయితే ఈ పేరు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారి, వివాదంగా రూపు దాల్చింది. కొందరు బాబుకు ఈ పేరు ఎందుకు పెట్టారో చెప్పాలంటూ డిమాండ్‌ చేయటం మొదలెట్టారు.

తైమూర్ అలీ ఖాన్ పటౌడీ పేరుపై కొందరు తమ పరిధిని దాటి వాదిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అసలు ఈ పేరు వెనుక ఉన్న కథ ఏంటంటే మంగోళ్ జాతి రాజు అయిన తైమూర్‌ 14వ శతాబ్ధంలో భారత దేశంపై దండయాత్ర చేసి ఢిల్లీలో పెను విధ్వంసం సృష్టించాడు.

వందల మంది ప్రాణాలు బలిగొన్నాడు. అలాంటి వ్యక్తికి గల పేరుని కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ లు వారి కొడుకు ఎలా పెట్టుకున్నారనే విషయంపై పెద్ద రాద్దాంతం జరుగుతోంది. ఈ విషయమై రిషి కపూర్ నెట్ జనులను హెచ్చరించారు. ఇప్పటి వరకు ఇటు సైఫ్ కాని అటు కరీనా కాని ఈ విషయంపై స్పందించకపోవడం గమనర్హం.

హెచ్చరిక

హెచ్చరిక

ఇది పక్కనపెడితే తైమూర్‌ అంటే.. ఉక్కు మనిషి, ధీరత్వం గల రాజు అని అర్థం వస్తుంది. నెటిజన్లు చేసిన కామెంట్స్‌ చూసిన నటుడు, కరీనా కపూర్‌ బాబాయి రిషి కపూర్‌ ట్విట్టర్‌ వేదికగా వారిని హెచ్చరించారు.

 జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి సైతం..

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి సైతం..

కాని కొందరు వ్యక్తులు ఈ పేరుని లోతుగా పరిశీలించి రచ్చ చేస్తున్నారని కొందరి వాదన. రీసెంట్ గా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఈ విషయంపై స్పందించి కరీనా దంపతులకు బాసటగా నిలిచాడు. ఇక కరీనా బాబాయి రిషీ కపూర్ అయితే ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయాడు. అర్ధరహిత కామెంట్స్ చేసే వారిని ఎండగట్టాడు.

 మీ పని మీరు చూసుకోండి...

మీ పని మీరు చూసుకోండి...


‘తల్లిదండ్రులు తమ కుమారుడికి పేరు పెట్టుకోవాలనుకుంటే.. జనాలు ఎందుకింత బాధపడిపోతున్నారో తెలియడం లేదు. మీ పని మీరు చూసుకోండి. పిల్లలకి ఏ పేరు పెట్టాలనేది తల్లిదండ్రుల ఇష్టం' అని ట్వీట్‌ చేశారు.

మీరు పెట్టలేదా

మీరు పెట్టలేదా

తర్వాత ఇంకా కోపంతో ‘మీ పని మీరు చూసుకోండి. మీ పిల్లల పేర్లు మీరు పెట్టలేదా? కామెంట్‌ చేయడానికి మీరెవరు?' అని ట్వీట్‌ చేశారు. కరీనా,సైఫ్ ల పిల్లాడు కు పేరు పెట్టడం గురించి మీకేం పని, ఇలా మాట్లాడే చాలా మంది పని పాటాలేని వాళ్లు, భావ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగ పరుస్తున్నవాళ్లే అని రిషీ కపూర్ అన్నారు.

 మీకెందుకు అంత బాధ

మీకెందుకు అంత బాధ

‘తల్లిదండ్రులు తమ శిశువుకి నచ్చిన పేరు పెట్టుకుంటారు. ఈ విషయం లో మీరు ఎందుకు బాధపడుతున్నారు.. వారిష్టం వారిది, మీ పని మీరు చూసుకోండి...వారేమి మీ పిల్లలకి పేర్లు పెట్టలేదు కదా అని రిషీ కపూర్ అన్నారు.

 ఆ పేర్లు పెట్టుకోవటం లేదా

ఆ పేర్లు పెట్టుకోవటం లేదా


గతాన్ని పరిశీలిస్తే అలెగ్జాండర్, సికిందర్ లు ఆధ్యాత్మిక గురువులేం కాదు కాదా.. మరి వారి పేర్లని చాలా మంది పెట్టుకోలేదా.. ఈ విషయంపై ఎందుకింత రచ్చ చేస్తున్నారంటూ నెటిజన్లని గట్టిగా ప్రశ్నించాడు రిషి కపూర్.

 ఇంక వాదనలు వద్దు

ఇంక వాదనలు వద్దు


ఇకపై ఈ విషయంపై వాదనలు చేస్తే చాలా మంది బ్లాక్‌(ట్విట్టర్‌లో) అయిపోతారని హెచ్చరించారు. జస్ట్ షట్ ద ఫక్ అప్ అంటూ ఆయన చాలా సీరియస్ అయ్యారు. తమ పూర్వీకులు ఈ పేరు పెట్టడంతో ఏమీ ఫీలవటం లేదని ఆయన అన్నారు.

English summary
Rishi Kapoor lost his cool on Twitter when he found some of the twitterati trolling baby Taimur Ali Khan for his name, given by Kareena Kapoor and Saif Ali Khan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu