»   » రీతూ ఫేటు ఫ్లైటెక్కినట్టే... పెళ్ళిచూపులు తో దశ తిరిగింది

రీతూ ఫేటు ఫ్లైటెక్కినట్టే... పెళ్ళిచూపులు తో దశ తిరిగింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

"పెళ్లి చూపులు" సినిమా సాధించిన సక్సెస్ తో రీతూవర్మ అందరి దృష్టిలోనూ పడింది. దాంతో వరుసగా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. అంతకుముందు 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో కనిపించినప్పటికీ.. ఆమెకు అంత పేరు రాలేదు. అయితే 'పెళ్లిచూపులు' సినిమా మాత్రం ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అయినప్పటికీ ఆ సినిమా తర్వాత కూడా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. నిఖిల్ కథానాయకుడిగా వస్తున్న ఓ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తుంది అని సమాచారమ్. ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ తరువాత వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినా, రీతూ వర్మ తనకి నచ్చిన పాత్రలకి మాత్రమే ఓకే చెబుతూ వెళుతోంది.

అయితే తాజాగా ఆమెకు ఓ బంపరాఫర్‌ వచ్చినట్టు తెలుస్తోంది. తమిళ స్టార్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌, స్టార్‌ హీరో విక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్‌గా రీతూవర్మను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. 'పెళ్లిచూపులు' చూసిన గౌతమ్‌ మీనన్‌కు రీతూ నటన బాగా నచ్చిందట. అందుకే తన సినిమాలో ఛాన్సిచ్చాడట. . గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా 'ధ్రువ నచ్చత్తిరం' అనే తెరకెక్కుతుంది. మొదట 'అనుఎమ్మానుయేల్' ని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అను ప్లేస్ లో రీతూవర్మ ని కన్ఫర్మ్ చేశారు. రీతూకు ఇది నిజంగా గొప్ప అవకాశమే. సహాయ పాత్రలో కనిపించిన నటి ఏకంగా విక్రమ్‌, గౌతమ్‌ మీనన్‌ సినిమాలో హీరోయిన్‌ అవకాశం అందుకోవడమంటే పెద్ద గెలుపే.

Ritu Varma in Vikram and Gautam Menon’s Dhruva Natchathiram

అసలు మొదట్లో గౌతమ్ మీనన్ చేయబోయే సినిమా పెళ్ళిచూపులు రీమేక్ అంటూ వార్తలు వచ్చినా.అవన్నీ రూమర్సే అని తేలిపోయాయి. రీమేక్ నిజమే అయినా అది గౌతమ్ మీనన్ చేసేది మాత్రం కాదు. సినీపరిశ్రమలో అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో చెప్పలేం. ఎంత టాలెంట్ ఉన్నా ఒక్కొక్కసారి అదృష్టం లేకపోతే చేతికొచ్చిన ఛాన్స్ పోగొట్టుకుంటారు. ఇప్పుడు 'పెళ్లికూతురు' హీరోయిన్ ఆ ఛాన్స్ కొట్టిందనే చెప్పాలి. చిన్న సినిమాయే అయిన 'పెళ్లిచూపులు' సూపర్ హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఇదే సినిమా తో రీతూ వర్మ ఫేట్ ఫ్లైటెక్కేసినట్టే అనుకుంటున్నారు.

English summary
Pelli chupulu Ritu Varma replaces Anu Emmanuel in Vikram's Dhruva Natchathiram. which is Directed by Gautam menon
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu