»   » బాయ్ ఫ్రెండ్‌తో హీరోయిన్ రియా సేన్ రహస్య వివాహం (ఫోటోస్)

బాయ్ ఫ్రెండ్‌తో హీరోయిన్ రియా సేన్ రహస్య వివాహం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ బ్యూటీ, తెలుగులో 'నేను మీకు తెలుసా?' చిత్రంలో మంచు మనోజ్ సరసన నటించిన హీరోయిన్ రియా సేన్ వివాహం మీడియా తెలియకుండా రహస్యంగా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో రెండు రోజుల క్రితం జరిగింది. నేడు పెళ్లి ఫోటోలను రియా సోదరి రైమా సేన్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

36 ఏళ్ల రియాసేన్ తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ శివం తివారీని పెళ్లాడారు. వివాహ వేడుక పెద్దగా హడావుడి లేకుండా సింపుల్‌గా జరిగింది. అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో బెంగాళీ సాంప్రదాయం ప్రకారం పెళ్లి వేడుక నిర్వహించారు.

శివం తివారీ

శివం తివారీ

ఫోటోగ్రాఫర్ అయిన శివమ్ తివారీ, రియా సేన్ మధ్య గత కొన్నేళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరూ కలిసి కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నారు. ఒకరినొకరు బాగా అర్థం చేసకున్నారు. అంతా ఒకే అనుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

రియా సేన్

రియా సేన్

'విష కన్య' అనే బాలీవుడ్ మూవీతో 1991లో కెరీర్ మొదలు పెట్టి హిందీ, తెలుగు, మళయాలం, తమిళం, ఒరియా, బెంగాళీ ఇలా చాలా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రియా సేన్.... 36 ఏళ్ల వయసులో తన ప్రియుడిని పెళ్లాడింది.

పెళ్లికి ముందే అన్నీ

పెళ్లికి ముందే అన్నీ

రియా సేన్, శివం తివారీ కొన్ని నెలలుగా కలిసే ఉంటున్నారు. ఇటీవల ఇద్దరూ కలిసి స్లోవేకియా వెకేషన్ కూడా వెళ్లి వచ్చారు. ఏదో జస్ట్ ఫార్మాలిటీ కోసం, చట్టపరమైన గుర్తింపు కోసమే ఇపుడు అఫీషియల్‌గా వివాహం చేసుకున్నారు.

కోరుకున్న క్వాలిటీస్ ఉన్న భర్త

కోరుకున్న క్వాలిటీస్ ఉన్న భర్త

రియా సేన్ తనకు కాబోయేవాడు ఆలోచనలో ఇంటలిజెంట్, ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో స్మార్ట్.... బాలీవుడ్ పరిశ్రమ బయటివాడు అయి ఉండాలని అని కోరుకునేది. ఆమె కోరుకున్న విధంగానే తగిన వాడు ఆమెకు భర్తగా లభించాడు.

కోట్లు తగలేయడం ఇష్టం లేకనే...

కోట్లు తగలేయడం ఇష్టం లేకనే...

సినీ స్టార్ల పెళ్లి వేడుక, వెడ్డింగ్ రిసెప్షన్ అంటే.... కోట్లలో ఖర్చు ఉంటుంది. అయితే అలాంటి హడావుడి ఏమీ లేకుండా, కోట్లు తగలేయకుండా సింపుల్‌గా వివాహ వేడుక పూర్తి చేశారు. వెడ్డింగ్ రిసెప్షన్ కూడా నిర్వహించడం లేదని తెలేస్తోంది.

English summary
Pictures of Riya Sen's wedding have been posted online, confirming the reports that the 36-year-old actress married long-time boyfriend Shivam Tewari in Pune earlier this week, likely Wednesday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu