»   » ప్రియుడిని పెళ్లాడబోతున్న హీరోయిన్ రియా సేన్.... ఇతడే (ఫోటోస్)

ప్రియుడిని పెళ్లాడబోతున్న హీరోయిన్ రియా సేన్.... ఇతడే (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ చిత్రసీమలో మరో హీరోయిన్ పెళ్లి భాజాలు మ్రోగబోతున్నాయి. 'విష కన్య' అనే బాలీవుడ్ మూవీతో 1991లో కెరీర్ మొదలు పెట్టి హిందీ, తెలుగు, మళయాలం, తమిళం, ఒరియా, బెంగాళీ ఇలా చాలా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రియా సేన్ త్వరలో తన ప్రియుడిని పెళ్లాడబోతోంది.

రియా సేన్ కొంత కాలంగా బాయ్ ఫ్రెండ్ శివమ్ తివారీతో డేటింగ్ చేస్తోంది. 36 ఏళ్ల ఈ బ్యూటీ ఇక ప్రేమ కలాపాలకు పులిస్టాప్ పెట్టి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. ఆగస్టు నెలాఖరులోనే రియా సేన్-శివమ్ తివారి వివాహం జరుగబోతోందని సమాచారం.

శివమ్ తివారీ

శివమ్ తివారీ

ఫోటోగ్రాఫర్ అయిన శివమ్ తివారీ, రియా సేన్ మధ్య గత కొన్నేళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరూ కలిసి కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నారు. ఒకరినొకరు బాగా అర్థం చేసకున్నారు. అంతా ఒకే అనుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Sushmita Sen DANCING with DAUGHTERS, video goes VIRAL | FilmiBeat
మున్ మున్ సేన్

మున్ మున్ సేన్

ప్రముఖ బాలీవుడ్ నటి మున్ మున్ సేన్ కూతురైన రియా సేన్...... తన ప్రేమ వివాహానికి ఇంట్లోవారిని కూడా ఒప్పించిందట. ఇరు కుటుంబాల అంగీకారంతోనే ఈ వివాహం జరుగబోతోంది.

కోరుకున్న క్వాలిటీస్ ఉన్నవాడినే

కోరుకున్న క్వాలిటీస్ ఉన్నవాడినే

రియా సేన్ తనకు కాబోయేవాడు ఆలోచనలో ఇంటలిజెంట్, ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో స్మార్ట్.... బాలీవుడ్ పరిశ్రమ బయటివాడు అయి ఉండాలని అని కోరుకునేది. ఆమె కోరుకున్న విధంగానే తగిన వాడు ఆమెకు భర్తగా రాబోతున్నాడు.

లింకప్స్

లింకప్స్

గతంలో రియా సేన్ మీద చాలా రూమర్స్ వినిపించాయి. ఆమె కొంతకాలంగా అష్మిత్ పటేల్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. తర్వాత క్రికెట్ శ్రీశాంత్‌తో కూడా ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. సెలబ్రిటీ సర్కిల్‌లో ఇవన్నీ చాలా కామన్ కాబట్టి రియా సేన్‌కు కాబోయేవాడు వీటిని లైట్ తీసుకున్నాడు.

English summary
Yet another Bollywood actress is all set to walk down the aisle! We are talking about Riya Sen who is all set to tie the knot with boyfriend Shivam Tiwari by the end of this month. Riya who made her Bollywood debut with Style has been dating Shivam for quite some time and if reports are to be believed then the couple now wants to take their relationship to the next level.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu