Don't Miss!
- News
సైబర్ నేరగాళ్ల ఘాతుకం: బీహార్‌లో తెలంగాణ పోలీసులపై కాల్పులు
- Sports
పుజారా కేవలం టెస్ట్ ప్లేయరని ఎవరన్నారు..? వన్డేల్లో బౌండరీల వరదతో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసిన ఘనుడు
- Finance
LIC: పాలసీదారులకు ఎల్ఐసీ సదవకాశం.. ల్యాప్స్ పాలసీ పునరుద్ధరణకు ఛాన్స్.. పెనాల్టీపై డిస్కౌంట్స్..
- Technology
దేశంలో అత్యధికంగా iPhones వినియోగిస్తున్నది ఆ నగరంలోనే!
- Automobiles
"పెద్ద నాన్న" తిరిగొచ్చేశాడు.. ఇంకేం దిగుల్లేదని చెప్పండి..! పాత స్కార్పియో రీ-ఎంట్రీ, వేరియంట్ల వారీగా లభించే
- Lifestyle
Glass Skin: చర్మం అద్దంలా మెరిసిపోవాలా.. ఇలా చేయండి
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
బాలకృష్ణ ఇంటి వద్ద కలకలం.. కారుతో దూసుకు వెళ్లి ఢీ కొట్టిన యువతి.. అసలు ఏమైదంటే?
నందమూరి బాలకృష్ణ అనూహ్యంగా వార్తల్లోకి వచ్చారు. జరిగిన ఘటనలో ఆయన ప్రమేయం లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆయన పేరు పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారుతోంది. అసలు ఏమైంది? ఆయన పేరు ఎందుకు వార్తల్లోకి వచ్చింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మహీంద్రా థార్ కారు
హైదరాబాద్ లోని హీరో నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 45 మలుపులో ఉన్న ఆయన నివాసం వైపుకు వేగంగా మహీంద్రా థార్ కారు దూసుకెళ్లింది. వేగంగా దూసుకు వెళ్తున్న కారును ఎలా అదుపు చేయాలో తెలియక పోవడంతో డివైడర్‌ను ఢీకొట్టింది. తర్వాత బాలకృష్ణ ఇంటివైపునకు వెళ్లిన కారు ఆయన ఇంటి గేట్ పక్కనున్న గ్రిల్ ను ఢీ కొట్టి ఆగిపోయింది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకోగా వెంటనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆల్కహాల్ అనలైజర్ టెస్ట్
అయితే బాలకృష్ణ ఇంటి పక్కనే ఉన్న సిగ్నల్ వద్ద అంబులెన్స్‌కు దారి ఇచ్చే క్రమంలో యువతి కారును డివైడర్‌పైకి ఎక్కించిందని అది అదుపు తప్పి దీంతో బాలకృష్ణ ఇంటిగేటు వైపునకు కారు దూసుకెళ్లింది. అయితే మెయిన్ సెంటర్ లో బాలకృష్ణ ఇంటి ముందు రోడ్డు ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా జనాలు భారీగా గుమిగూడారు. దీంతో అక్కడ కొంచెం సేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనం నడుపుతున్న యువతిని అదుపులోకి తీసుకుని ఆమె ఏమైనా మద్యం సేవించిందా అని అనుమానంతో ఆమెకి ఆల్కహాల్ అనలైజర్ టెస్ట్ చేశారు.

గాయాలు కాకపోవడంతో
అయితే అందులో ఆమె మద్యం తాగలేదని గుర్తించారు. అదుపు తప్పే వాహనం అలా దూసుకు వచ్చిన సంగతి తెలుసుకుని పోలీసులు వాహనాన్ని అక్కడి నుంచి తొలగించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ క్రమంలోనే పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి వాహనాలను పంపించి వేశారు. మరోపక్క నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

స్పెషల్ సాంగ్
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో దునియా విజయ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో డింపుల్ హయాతి ఒక స్పెషల్ సాంగ్ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది. కానీ చివరికి భారత మూలాలున్న ఆస్ట్రేలియా పౌరురాలు చంద్రిక రవి ఈ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు తేలింది.

అనిల్ రావిపూడితో
ఇప్పటికే ఈ స్పెషల్ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కు స్టెప్స్ సమకూరుస్తున్నారు. బాలకృష్ణ సినిమా షూటింగ్ లో ఉండగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన అనిల్ రావిపూడితో ఒక సినిమా ప్లాన్ చేశారు.