»   »  షాక్.... రోబో-2 బడ్జెట్ ‘బాహుబలి’ని మించిపోతోంది!

షాక్.... రోబో-2 బడ్జెట్ ‘బాహుబలి’ని మించిపోతోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రజనీకాంత్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ ప్లాన్ చేసిన ‘రోబో-2' సినిమా ఎట్టకేలకు ఇటీవల ప్రారంభం అయింది. ‘2.0' టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలోని విలన్‌ పాత్రకు ప్రముఖ హాలీవుడ్‌ స్టార్‌ ఆర్నాల్డ్‌ని దర్శకుడు శంకర్‌ ఎంపిక చేసుకున్న విషయం విదితమే. అయితే కొన్ని కారణాల రీత్యా ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఆర్నాల్డ్‌ని దర్శకుడు శంకర్‌ తప్పించారు. ఆర్నాల్డ్‌ ప్లేస్‌లో విలన్‌గా అక్షయ్‌కుమార్‌ నటిస్తున్నారు. ఈ విషయమై అక్షయ్ ట్వీట్ సైతం చేసారు.

‘బాహుబలి' ముందు వరకు ఇండియాలో భారీ చిత్రాల దర్శకుడు అంటే.... శంకర్ పేరే వినిపించేది. అయితే రాజమౌళి వచ్చి శంకర్ కు సవాల్ విసిరారు. దాదాపు 250 కోట్లకు పైగా బడ్జెట్‌తో ‘బాహుబలి' మూవీని పక్కా ప్లానింగుతో తెరకెక్కంచిన రాజమౌళి ఇండియన్ సెల్యూలాయిడ్‌పై ఓ అద్భుతాన్నే సృష్టించాడు.

‘Robo 2’ budget Rs.400 cr?

ఈ నేపథ్యంలో దర్శకుడు శంకర్ రోబో-2ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ రేంజిలో తీసేందుకు ప్లాన్ చేసిన ఆయన రూ. 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసారట. రాజమౌళి బాహుబలి రెండు పార్టులు కలిపి రూ. 250 కోట్లు బడ్జెట్ ఖర్చు చేస్తే...శంకర్ ఒక సినిమాకే 400 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నారంటే సినిమా రేంజి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

అలా అని శంకర్ అనవసరంగా ఖర్చు పెట్టిస్తాడనుకుంటే పొరపాటే. ఆయన ఖర్చె పెట్టించే ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది. అంతగ్రాండ్ గా ఉంటుంది సినిమా. ఇండియన్ సినిమా చరిత్రలో ఇదే హై బడ్జెట్ మూవీ కాబోతోంది. శంకర్ జోరు చూస్తుంటే బాహుబలి రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

3డి ఫార్మాట్‌లో తీయనున్న ఈసినిమాని ఇంటర్నేషనల్‌గా రిలీజ్‌ చేయటానికి ప్లాన్‌చేశారు. సౌత్‌ నుంచి ఇంటర్నేషనల్‌ వరకూ ఓ సినిమాని ఒకే టైటిల్‌తో ప్రమోట్‌ చేయటానికి శంకర్‌ ఈ సినిమా టైటిల్‌ని 2.0గా మార్చినట్లు చెబుతున్నారు.

English summary
It is learnt that the budget of the Robo 2 is Rs.400 crores, which is the highest ever for an Indian film. The combined budget of the two parts of ‘Baahubali‘ is around Rs.250 crores.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu