For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తెలుగు తమిళ ఇండస్ట్రీల మధ్య ఈ పోటీ మంచిదేనా!? రాజమౌళీ V/S శంకర్ ఈ పోటీ ఎక్కడికి తీసుకెళ్తోంది?

  |

  ఒక రెండూ మూడూ సంవత్సరాల క్రితం వరకూ భారీ బడ్జెట్ సినిమాలలో ఎక్కూవగా తెలుగులో కన్నా తమిళ ఇందస్ట్రీనుంచే వచ్చేవి, శంకర్, లేదంటే కేఎస్ రవికుమార్ వీళ్ళిద్దరూ కాదంటే మణిరత్నం ఒక సినిమాకోసం డబ్బునీ సమయాన్నీ విపరీతంగా ఖర్చు చేసేవాళ్ళు.అయితే సినిమా ఎంత ఆలస్యం అయినా ఎంత బడ్జెట్ అయినా ఫలితాల్లో ఆ తేడా ప్రత్యక్షంగా కనిపించేది. తెలుగులో మాత్రం మరీ అంత పెద్ద పెద్ద బడ్జెట్ ల జోలికి వెళ్ళే సాహసం చేయలేక పోయారు.

  అయితే ఇప్పుడు శంకర్ కి పోటీగా జక్కన్న వచ్చాడు. మగధీర తో ఒక ట్రయల్ వేసి చూసి ఓకే అనుకున్నాక బాహుబలి మొదలు పెట్టాడు. అయితే ఇక్కడ మనం అనుకున్నట్టు రాజమౌళి, శంకర్‌ల మధ్య డైరెక్ట్‌ పోటీ ఏమీ లేదు కానీ, సోషల్‌ మీడియాలో మాత్రం ఇదో పెద్ద హాట్‌ డిస్కషన్‌ టాపిక్‌ అయింది. 'బాహుబలి 2' వర్సెస్‌ 'రోబో 2' అంటూ చాలా కాలంగా ఫాన్‌ వార్స్‌ నడుస్తున్నాయి. అయితే ఈ తరహా పోటీ ఉండటం మంచుఇదే కానీ ఇలా పోటీలు పడి మరీ బడ్జెట్ లమ్ని పెంచుకుంటూ పోతూంటే. మరి చిన్న సినిమాల పరిస్థితేమిటి? అన్న ప్రశ్నరాక మానదు. ఈ తరహా సినిమాలు ప్రయోగాత్మకంగా అయితే ఓకే గానీ పోటీలు పడి కళాఖండాల కోసమే సంవత్సరాలకి సంవత్సాలు తినేస్తూ పోతే సినీ పరిశ్రమకే ప్రమాదం ఔతుంది.

  రోబో రికార్డులని బాహుబలి అధిగమించి చరిత్ర సృష్టించడంతో దాని రికార్డులని బ్రేక్‌ చేయడానికే శంకర్‌ 'రోబో 2' మొదలు పెడుతున్నాడంటూ మీడియా కూడా ఆజ్యం పోసింది. దాంతో తెలీకుండానే ఈ రెండు చిత్రాల మధ్య ఇప్పుడు కంపారిజన్స్‌ ఎక్కువయ్యాయి. అయితే రజనీకాంత్‌ 'కబాలి' లాంటి సాధారణ చిత్రంతోనే బాహుబలి ఓపెనింగ్‌ రికార్డులని బ్రేక్‌ చేయడంతో ఇక ఆయనకి శంకర్‌ ప్లస్‌ గ్రాఫిక్స్‌ తోడయితే ప్రభంజనం తారాస్థాయిలో ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల స్టామినా ఎంతెంత అని చూస్తే....

  రాజమౌళీ V/S శంకర్

  రాజమౌళీ V/S శంకర్

  అయిదు సంవత్సరాల క్రితం శంకర్ రోబో ని తెరకెక్కించాడు అప్పటి వరకూ దక్షిణ భారత సినీ ఇండస్ట్రీ లోనే కాది మొత్తం భారత దేశం లోనే రోబో లాంటి ఒక విజువల్ వండర్ రాలేదు... ఇక శంకర్ ని మించిన దర్శకుడు లేడనీ ఇక రాడనీ అనుకున్నారు... రోబో భారీ బడ్జెట్ సినిమాల్లోనే ఒక రెవెల్యూషన్ గా మిగిలింది.

  రాజమౌళీ V/S శంకర్

  రాజమౌళీ V/S శంకర్

  రోబో హిట్ కి కారణం కేవలం బడ్జెట్టో లేదంటే శంకర్ మేకింగో మాత్రమే కాదు ఈ రెండిటికీ సరి సమానంగా ఉన్న రజినీ చరీష్మా... సగానికి పైగా సినిమాకి హైప్ వచ్చిందంటే కారణం రజినీకాంత్

  రాజమౌళీ V/S శంకర్

  రాజమౌళీ V/S శంకర్

  బాహుబలికి మాత్రం ఈ స్టార్ డం కేవలం తెలుగు వరకే పనికి వచ్చింది., దాన్లో రాజమౌళి సొంత ఫాలోయింగ్ కూడా కొంత ఉండనే ఉంది...

  రాజమౌళీ V/S శంకర్

  రాజమౌళీ V/S శంకర్

  రోబో తీసేనాటికి అంతటి హైప్ తెచ్చుకున్న సినిమా మరొకటి లేదు అప్పటికి అదే ఒక విజువల్ అద్బుతం మరొకటి లేదు. తెర మీద చిట్టి రోబో విన్యాసాలని అలా నోళ్ళు వెళ్ళబెట్టి కూచిండిపోయాడు ప్రేక్షకుడు.

  రాజమౌళీ V/S శంకర్

  రాజమౌళీ V/S శంకర్

  అయితే అప్పటి వరకూ అగ్ర స్థానం లోనే ఉన్న రోబోని పక్కకు జరిపాడు బాహుబలి. ఒక్క సారి తెలుగు సినిమా సత్తా ఏమిటో చెప్తున్నట్టు అప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డులనీ తొక్కిపారేసాడు. ఇక రోబో కాస్త మసక బారాడు.

  రాజమౌళీ V/S శంకర్

  రాజమౌళీ V/S శంకర్

  ఇప్పుడు మళ్ళీ ఈ రెండు సినిమాలూ... సీక్వెల్స్ తో రానున్నాయి బాహుబలి-2 సిద్దం అయిపోయినట్టే... రోబో 2.0 మాత్రం ఇంకా షూటింగ్ దశలోన్నే ఉంది. ఈ సారి రజినీ కి తోడుగా బాలీవుడ్ హీరో అక్షయ కుమార్ కూడా వచ్చాడు.

  రాజమౌళీ V/S శంకర్

  రాజమౌళీ V/S శంకర్

  అయితే బాహుబలి కి తెలుగు గడప దాటితే స్టార్ ఫాలోయింగ్ ఎందుకూ పనికి రాదు. అడపాదడపా ఒకటీరెండు హిబందీ సినిమాలు చేసిన రాణా, ఒకళ్ళిద్దరు తమిళ స్టార్లు తప్ప వేరే గ్లామర్ ఆకర్షన లేదు. కేవలం కథ, రాజమౌళి మాత్రమే ఇప్పుడు బాహుబలికి ఉన్న గ్లామర్.

  రాజమౌళీ V/S శంకర్

  రాజమౌళీ V/S శంకర్

  కానీ రోబో-2.0 కి రజినీ ఒక్కడే చాలు... అసలే కబాలి విషయం లో రజినీ సత్తా ఏమిటో చూసే ఉన్నాం గనక, రోబో ఇప్పటికే వేసిన బేస్ ఈ సారి మరింత హెల్ప్ అవ్వచ్చు కానీ బాహుబలి ఇప్పటికే రోబోని మించిన హైప్ తోఉంది.

  రాజమౌళీ V/S శంకర్

  రాజమౌళీ V/S శంకర్

  అంతే కాదు బాహుబలి 2 చిత్రం ముందుగా విడుదల కానుంది కనుక ఇది సాధించే రికార్డులు అసలు అనితర సాధ్యమన్నట్టు ఉండాలి. లేదంటే శంకర్‌, రజనీకి తోడు రోబో ఫ్యాక్టర్‌ తోడయితే వసూళ్లు ఎలా ఉంటాయనేది ఊహకి కూడా అందడం లేదు.

  రాజమౌళీ V/S శంకర్

  రాజమౌళీ V/S శంకర్

  ఇప్పటికే అందిన సమా చారం ప్రకారం రోబో 2.0 బడ్జెట్ 300 కోట్లను దాటేలాఉంటే ఇక బాహుబలి-2 బడ్జెటేమో 250 కోట్లకు చేరుకుంది అయితే సినిమా పూర్తయ్యే నాటికి ఇది మరింత పెరగవచ్చు.ఇదివరకెప్పుడూ స్థానిక భాషల సినిమాల్లో వినని బడ్జెట్లివి..

  రాజమౌళీ V/S శంకర్

  రాజమౌళీ V/S శంకర్

  ఇంతకాలం బాహుబలిని కొట్టడం మాటలు కాదన్నవారే ఇప్పుడు రోబో 2తో బాహుబలి 2 రికార్డులు కూడా ఆంఫట్‌ అయిపోతాయని జోస్యం చెబుతున్నారు.

  రాజమౌళీ V/S శంకర్

  రాజమౌళీ V/S శంకర్

  రాజమౌళి తీస్తున్నది రికార్డుల కోసం కాకపోయినప్పటికీ తెలుగు వర్సెస్‌ తమిళ వైభవానికి ప్రతిష్టాత్మకంగా ఈ రెండు చిత్రాలు మారుతున్నాయి. ఇన్నాళ్ళు భారీ సినిమాలంటే మావే అంటూ కాలరెగరేసిన తమిళ ఇండస్ట్రీ ముందు మరో సారి మన తెలుగు సినిమా సత్తా ఏమిటో తెలియాలన్నా., మేమే గొప్ప అనుకుంటూ తెగ ఇదైపోయే బాలీవుడ్ కాస్త ఆలోచించాలన్నా.

  రాజమౌళీ V/S శంకర్

  రాజమౌళీ V/S శంకర్

  ఈ సారి బాహుబలి దెబ్బ మామూలుగా ఉండకూదదు... చిట్టి రోబో కన్నా.. అమరేంద్ర బాహుబలి దెబ్బ ఇంకా గట్టిగా ఉండాలి. చూద్దం ఏమౌతుందో...

  English summary
  As per some sources, the budget of 'Robo 2' will be Rs.300 crores. Rajamouli recently revealed that the total budget of the two parts of 'Baahubali' will be 250 crores. So the budget of 'Robo 2' will be surpassing Baahubali's.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X