»   » పులి, ఖలేజా, బృందావనం, తాకిడికి ‘రోబో’ కన్నారావు కన్ ఫ్యూజన్..

పులి, ఖలేజా, బృందావనం, తాకిడికి ‘రోబో’ కన్నారావు కన్ ఫ్యూజన్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్ 'రోబో' సినిమా తెలుగు హక్కులు కన్నారావు కైవసం చేసుకున్న విషయం విదితమే. ఇప్పటికే 15 కోట్ల రూపాయలను నిర్మాతలకు అందజేశారు. ఇంకా 12 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అయితే విడుదలకు ముందే పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆయనను ప్రోత్సహించారు.

ఇండస్ట్రీలో పెద్దగా ప్రాచుర్యం లేని ఈయన ఈ చిత్రం హక్కులు పొందడం విశేషం. ఇదిలావుండగా.. నైజాం హక్కులకోసం ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ పోటీపడుతున్నారు. అయితే నైజాంకు 15 కోట్ల రూపాయలివ్వాల్సిందిగా కన్నారావు అడుగుతున్నారు. కానీ చిత్రం ఏమాత్రం తేడా చేసినా అంతేసంగతులని...ఆచితూచి స్పందిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి. దీంతో కన్నారావు కాస్త కన్‌ ఫ్యూజన్ లో ఉన్నట్లు ఫిలిమ్ నగర్ సమాచారం.

ఈ చిత్రం హక్కులు మొదట చదలవాడ శ్రీనివాసరావుకు ఇచ్చామనీ ఆ తర్వాత ఇవ్వలేదని వాదన ఉంది. ఇలాగే మరో ముగ్గురు పోటీపడ్డారు. డాన్ శీను నిర్మాత వెంకట్, ఆవారా రిలీజ్ చేసిన శోభ ఉన్నారు. అయితే ఈ చిత్రం 30 కోట్ల రూపాయలు పెట్టడం అనవసరం అని వారు వదులుకున్నారు. అయితే కన్నారావుకు అల్లు అరవింద్ సపోర్ట్ ఉందనీ, థియేటర్లు ప్రాబ్లమ్స్ ఉండవని అనుకున్నారు.

కానీ ప్రస్తుతం 'కొమరం పులి", 'బృందావనం", మహేష్ 'ఖలేజా" చిత్రాలు విడుదలకు సిద్ధం కావడంతో థియేటర్లు వెతుక్కునే పరిస్థితి వచ్చింది. ఈ నెల 25న లేదంటే 27న కానీ రోబో విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి ఈలోపు కన్నారావు ఏం చేస్తాడో చూడాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu