»   » మహేష్ బాబుకి, ఎన్టీఆర్ కీ ఇది ఊహించని పెద్ద సమస్యే

మహేష్ బాబుకి, ఎన్టీఆర్ కీ ఇది ఊహించని పెద్ద సమస్యే

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్, ఐశ్వర్యారాయ్ జంటగా దర్శకుడు శంకర్ రూపొందించిన 'రోబో' సినిమా 2,250 ప్రింట్లతో ప్రపంచమంతటా అక్టోబర్ ఒకటవ తేదీన విడుదల కానుంది. దాంతో ఎన్టీఆర్ తాజా చిత్రం బృందావనం, మహేష్ ఖలేజా చిత్రాలు అనుకున్న డేట్( సెప్టెంబర్ 30) కి రిలీజ్ చేస్తారా లేదా అన్న సందేహం అందరిలో కలుగుతోంది. ఎందుకంటే ఈ భారీ చిత్రం కోసం ధియోటర్ అన్నీ బల్క్ గా బుక్ చేయటం ఒకెత్తు అయితే రజనీకాంత్ హవా ముందు ఈ చిత్రాలు ఏ రేంజిలో కలెక్షన్స్ లాక్కోగలవు అనేది మరో సమస్య అంటున్నారు ట్రేడ్ నిపుణులు. అందులోనూ దేశంలోనే ఇది అతి భారీ చిత్రం ఇది కావటం, పిల్లలను పెద్దలను ఆకర్షించే సైన్స్ పిక్షన్ కావటం, ఒక్క ప్లాప్ లేని శంకర్ ట్రాక్ రికార్డు ఇవన్నీ పరిగణన లోకి తీసుకని వాయిదా వేస్తారా లేదా అన్నది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల అవుతున్న రోబో చిత్రం తెలుగు రైట్స్ ని శ్రీకృష్ణా ట్రేడర్స్ అధినేత తోట కన్నారావు తీసుకున్నారు. ఇక ఇప్పటికే రోబో ట్రైలర్లు విడుదలై సంచలనం సృష్టిస్తున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu