»   » నిజమా...అక్కడ 'రోబో' కలెక్షన్స్ అప్పుడే డ్రాప్?

నిజమా...అక్కడ 'రోబో' కలెక్షన్స్ అప్పుడే డ్రాప్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్ "రోబో" కలెక్షన్స్ నార్త్ లో బాగా డల్ గా ఉన్నాయంటూ భాక్సాఫీస్ ఇండియా వారు లెక్కలు తేల్చారు. వారు చెప్పే లెక్కలు ప్రకారం..శుక్ర, శని, ఆదివారాల్లో కలెక్షన్స్ నిలకడగా ఉన్నాయని, సోమవారం డ్రాప్ అయ్యాయని చెప్తున్నారు. అలాగే ఆ కలెక్షన్స్ కూడా ఎక్కువగా ముంబై సర్కూట్ నుంచి వచ్చాయని, అక్కడ మూడు కోట్ల ఇరవై లక్షలు కలెక్టు చేసిందని, మొత్తం మీద హిందీ మార్కెలో ఈ మూడు రోజులుకు కేవలం ఏడు కోట్లు మాత్రమే రెవిన్యూ వచ్చిందని చెప్తున్నారు. ఇక డిల్లీ, గారగాన్ లోల చాలా లిమిటెడ్ గా విడుదల అయిందని, అక్కడ కలెక్షన్స్ ఓకే అన్నట్లు ఉన్నాయని చెప్తున్నారు. అయితే మహారాష్ట్ర, సిపి బీహార్ బెస్ట్ కలెక్షన్స్ వచ్చాయని తేల్చారు. మరో ప్రక్క అదే రోజు విడుదలైన అంజానా అంజాని చిత్రం మంచి పరిస్ధితి బాగుందని, కలెక్షన్స్ ని అదే కొట్టుకెళ్ళుతోందని వ్యాఖ్యానించారు. ఇక విడుదలైన మొదటి రోజు మాత్రం ఉత్తర ప్రదేశ్, మద్య ప్రదేశ్ లలో బంద్ ఉండటం వల్ల రోబోకు ఎఫెక్టు అయిందని అన్నారు. ఏదైమైనా రెండోవారంలోకి ప్రవేశిస్తేగానీ అసలు కలెక్షన్స్ ఏమిటన్నది బయిటపడవని అంటున్నారు. ఇక ఈ కలెక్షన్స్ లెక్కలు నార్త్ మీడియా కావాలనే సౌత్ సినిమాను చిన్నపరిచే విధంగా తేలుస్తారని సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu