For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Home

  By Staff
  |

  ఇంటర్వ్యూ

  Monday, September 13 2004

  గుడుంబా శంకర్‌ అంచనాలకుతగ్గట్టు లేకపోయినా హీరోయిన్‌ మీరా జాస్మిన్‌ మాత్రంముద్దుగా బొద్దుగా ప్రేక్షకులను అలరించింది. ఆమె ఇంటర్వ్యూ.జాతీయ అవార్డు పొందిన తర్వాత ఆమెనటించిన గుడుంబా శంకర్‌ ప్రేక్షకులనే కాదు ఆమెనూనిరుత్సాహపరిచి ఉంటుంది. జాతీయ అవార్డు తెచ్చిన పదోమ్‌ ఒన్ను ఒరువిలాపం గురించే ఈ ఇంటర్వ్యూలో ఆమె ఎక్కువగా మాట్లాడింది.

  ప్రశ్న: మీరు తిరువళ్ళకు చెందినక్రిస్టియన్‌ అమ్మాయి కదా? అవార్డు పొందిన ఆ లో ముస్లింయువతిగా అంత సహజంగా ఎలా నటించగలిగారు?

  మీరా: చిన్నప్పుడు నేను ఒకమారుమూల గ్రామంలో పెరిగాను. నాకు జ్వరం వచ్చినప్పుడల్లామానాన్న నన్ను భుజాన వేసుకుని పొరుగూరికి తీసుకెళ్ళేవాడు.అప్పుడు ఆ గ్రామంలోని ముస్లింల జీవన విధానాన్ని, వారి హావభావాలనుపరిశీలించేదాన్ని. విలాపం షూటింగ్‌ జరిగిన గ్రామాన్ని చూడగానే నాచిన్ననాటి గ్రామం, వాతావరణ గుర్తుకు వచ్చాయి.

  ప్రశ్న: ఆ పాత్ర కోసం మీరు ప్రత్యేకసాధన ఏమైనా చేశారా?
  ఆ రోజుల్లో మానాన్న కాంట్రాక్టులుచేసేవారు. ఆదాయం బాగా ఉండడంతో మా కుటుంబం విలాసవంతంగాఉండేది. కొంతకాలానికి మానాన్న వ్యాపారం దెబ్బతిన్నది. మా ఆర్ధికదుస్ధితి పైకి కన్పించకుండా జాగ్రత్త పడేవాళ్ళం. నాస్నేహితురాళ్ళు ఎంబిబిఎస్‌, ఇంజినీరింగ్‌లలో చేరారు. డాక్టరుకావాలను ఉన్నా ఆర్ధిక పరిస్ధితి నాకు సహకరించలేదు. ఆ విషాదం కారణంగానే ఆ లోషహీన్‌ పాత్రలో లీనం కాగలిగాను.

  అవార్డు పొందాలన్న లక్ష్యంతోనే ఆ చిత్రంలోకష్టపడి పనిచేశారా?
  తెలుగు వంటి ఇతర భాషల్లో నేనునటిస్తాను. మలయాళంలో మాత్రం నటించాల్సిన అవసరం లేదు.పాత్రలో జీవిస్తే చాలు. ప్రోత్సాహం ఉంటే గానీ నేను గొప్పగానటించలేను. ఆ డైరెక్టర్‌ చంద్రన్‌ ఆర్టిస్టుల ప్రతిభనువెలికి తీయడానికి ఎంతగానో ప్రోత్సహిస్తారు.

  గుడుంబా శంకర్‌లో మీరు సొంతంగాడబ్బింగ్‌ చెప్పుకోడానికి కారణం?
  తెలుగు వచ్చిన హీరోయిన్లు కూడాసొంతంగా డబ్బింగ్‌ చెప్పడం లేదు కదా?

  ఆ సాహసం మీరెందుకుచేశారు?
  నిజానికి ఆ కు నామాటలు నేనుపలకాలన్న కోరిక కలిగింది. అదే విషయం నిర్మాత నాగబాబుకు, హీరోపవన్‌కు చెప్పాను. వెరైటీగా ఉంటుందని వెంటనే వాళ్ళుఅంగీకరించారు.

  షూటింగ్‌ ్రస్టెస్‌ను మీరెలాఅధిగమించగలుగుతున్నారు?
  అది కష్టమే. సెలవులకు ఒక సారిఇంటికెళ్ళి తిరిగి వచ్చినప్పుడు షూటింగ్‌కు వెళ్ళబుద్ధి కాదు. వాంతులు,కడుపు నోప్పి వచ్చినట్టుగా ఉంటుంది.

  మీకు ఎటువంటి పాత్రలు ఇష్టం?
  నేను చేయగలిగిన పాత్రలు. నిజజీవితానికి దూరంగా ఉండే డైలాగులు చెప్పడానికి ఇబ్బంది పడతాను.

  మీ స్వభావమేమిటి?
  చాలా ఎమోషనల్‌. ఒక్కోసారి మౌనంగాఅలా కూర్చును ఉండిపోవాలనుకుంటాను. ఎవరైనా ఆ నిశ్సబ్దానికి భగంకలిగిస్తే వాళ్ళని చంపేయాలన్నంత కోపం వస్తుంది. ప్రయాణంలో విషాద గీతాలువిన్నప్పుడు కన్నీళ్ళు ఆపుకోలేను. అప్పుడు నన్ను చూసిన వాళ్ళునేను పిచ్చిదాన్నని అనుకుంటారు.

  ఒక నటిగా మీ బలం ఏమిటి?
  నా ఫ్యాన్‌ మెయిల్స్‌ చదువుతాను. ఏపాత్ర వేసినా దానికి సరిగ్గా సరిపోయినట్టు ఉంటుందని కొందరురాస్తుంటారు. అదే నా బలం

  Archives

  హోంపేజి
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X