»   » పాత్రలో ప్రత్యేకత ఉంటే మరిన్ని సినిమాల్లో నటిస్తాను: రోజా

పాత్రలో ప్రత్యేకత ఉంటే మరిన్ని సినిమాల్లో నటిస్తాను: రోజా

Posted By:
Subscribe to Filmibeat Telugu

శంభో శివ శంభో చిత్రంలో నన్ను చూసిన వారందరూ నాలో ఏ మార్పూ రాలేదని అంటున్నారు. కథానాయికగా ఉన్నప్పుడు ఎలా ఉన్నానో ఇప్పటికీ అంగే గ్లమార్ గా ఉన్నాని ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉందని నటి రోజూ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నాం శ్రీ సాయి గణేష్ బ్యానర్లో, బెల్లం కొండ సురేష్ నిర్మాణంలో, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్నా 'గోలీమార్" షూటింగ్ స్పాట్ లో ఆమె విలేకరులతో కొద్ది సేపు ముచ్చటించారు. పాత్రలో ప్రత్యేకత ఉంటే నేను తప్పకుండా మరిన్ని సినిమాల్లో నటిస్తాను.

మరలా సినిమాల్లో నటించాలి అనుకుంటున్నాప్పుడు నాకు శంభో శివ శంభో చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అందులో కాస్త పొగరుగా కనిపించే పాత్ర, అలా అని నెగెటివ్ పాత్ర ఎంత మాత్రం కాదు. ఆ సినిమా విడుదలయ్యాక చాలా మంది నటించమని నన్ను సంప్రదిస్తున్నారు. మరి నా ఇమేజ్ ని మరింత పెంచుకోవడం కోసం వైవిద్యమైన పాత్రలను ఎంపిక చేసుకుంటున్నాను. ఆర్థిక అవసరాల కోసం మరలా నటిస్తున్నానని అనుకోవడం పొరపాటు. సినిమా మీద ఉన్న ఆసక్తితోనే కొనసాగుతున్నాను అని తెలిపారు.

సినిమా పరిశ్రమలోని పోకడలను వివరిస్తూ 'నేను కథానాయికగా ఉన్నప్పుడు లొకేషన్ లో చాలా మంది పెద్దవారుండేవారు. చుట్టూ పరిసరాలు గుంభనంగా అనిపించేవి. ఇప్పుడు పరిస్థితి వేరు. అందరూ స్నేహ పూర్వకంగా ఉంటున్నారు. నాయికలు విషయంలో తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం నటించే హీరోయిన్స్ మరో ఏడాది మారే సరికల్లా కనిపించట్లేదు. ప్రజల మనస్పుల్లోనూ నాయికలు గొప్ప స్థానాన్ని సంపాదించుకోలేకపోతున్నారు" అని వ్యాక్యానించారు.

'రాజకీయాల నుంచి నేను పూర్తిగా బయటకు రాలేదు. కాకపోతే ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేను. ఇక సినిమాలకు, రాజకీయాలకు సమప్రాధాన్యతనిస్తాను. చేపట్టిన పనిని నాణ్యంగా పూర్తి చేయాలని తపిస్తాను" అని ముక్తాయించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu