»   » నాకేం అభ్యంతరం లేదు, ముందు వర్మని మాట్లాడనివ్వండి: ఎన్టీఆర్ బయోపిక్‌పై రోజా స్పందన

నాకేం అభ్యంతరం లేదు, ముందు వర్మని మాట్లాడనివ్వండి: ఎన్టీఆర్ బయోపిక్‌పై రోజా స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu
Roja Character in Lakshmi's NTR రోజా ఏమన్నారంటే..? | Oneindia Telugu

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్. దీని మీద ఎలాంటి వార్త వచ్చినా అంతా ఆసక్తిగా చూస్తున్నారు.రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తానంటోన్న 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సెట్స్‌ మీదకు వెళ్ళి, ప్రేక్షకుల ముందుకొచ్చేదాకా ఆ సినిమాపై అనుమానాలు అలాగే వుంటాయి. ఎందుకంటే, అక్కడున్నది రామ్‌గోపాల్‌ వర్మ. ఈలోగా వర్మ, తనకు కావాల్సిన పబ్లిసిటీ సంపాదించేసుకుంటాడు. అదే వర్మ ప్రత్యేకత.

 వర్మ పబ్లిసిటీ సంగతేమోగానీ

వర్మ పబ్లిసిటీ సంగతేమోగానీ

వర్మ పబ్లిసిటీ సంగతేమోగానీ, వర్మ తన సినిమా కోసం ఎంచుకునే కాన్సెప్ట్‌, సహజంగానే సమాజంలో కొంత అలజడిని అయితే సృష్టించేస్తుంది. చిత్తూరు జిల్లాలోని పలమనేరులో లక్ష్మీస్‌ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి ఇంటికి దర్శకుడు రాంగోపాల్‌వర్మ వెళ్ళినప్పుడు సినిమా గురించి మీడియాతో మాట్లాడాడు.

ఎమ్మెల్యే రోజాకు అవకాశం

ఎమ్మెల్యే రోజాకు అవకాశం

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అడుగు పెట్టినప్పటి నుంచి ఆయన చనిపోయే దాకా జరిగిన సంఘటనల ఆధారంగా చిత్రం తెరకెక్కిస్తున్నానని, చిత్రంలో పాత్రలకు సంబంధించి ఇంకా ఎవరనీ నిర్ణయించలేదంటూనే ఎమ్మెల్యే రోజాకు మాత్రం అవకాశం ఉంటుందని చెప్పాడు. దాంతో అందరి చూపూ రోజాపైకి మళ్ళింది. రోజా ఏం చెప్తుందా అంటూ ఎదురు చూసారు.

ఏ రోల్ ఇస్తాడో తెలియదు

ఏ రోల్ ఇస్తాడో తెలియదు

ఈ ఆఫర్‌పై నగరి ఎమ్మెల్యే రోజా సానుకూలంగా స్పందించింది. వర్మ ఏ రోల్ ఇవ్వాలనుకుంటున్నారో తనకు తెలియదని, మంచి రోల్ ఇస్తే నటించటానికి తనకే అభ్యంతరమూ లేదనీ అయితే.... వర్మ సంప్రదించాక అన్ని వివరాలూ వెల్లడిస్తానని బాల్ ని మళ్ళీ వర్మ కోర్ట్లోనే పడేసింది..

టైటిల్ రోల్ లోనే రోజాని గనక తీసుకుంటే

టైటిల్ రోల్ లోనే రోజాని గనక తీసుకుంటే

ఒక వేళ టైటిల్ రోల్ లోనే రోజాని గనక తీసుకుంటే మాత్రం రోజాకి ఇది మంచి అవకాశమే అని చెప్పాలి. 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' టైటిల్‌ కాబట్టి, ఎన్టీఆర్‌ పాత్రకు వుండే ప్రాధాన్యతకు సమానంగా, ఇంకొంచెం ఎక్కువగా లక్ష్మీపార్వతి పాత్రకు వుంటుంది. సో, ఆ లెక్కన ఆ పాత్రకి రోజా అయితే పెర్‌ఫెక్ట్‌ అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా, స్వర్గీయ ఎన్టీఆర్‌ అంటే రోజాకి ప్రత్యేకమైన అభిమానం. ఆ ఛాన్స్‌ వస్తే, ఆమె వదులుకునే అవకాశమే వుండదు.

సానుకూలంగా స్పందించింది

సానుకూలంగా స్పందించింది

నిజానికి రోజా ఇటీవలి కాలంలో రాజకీయంగా ఆమె బాగా బిజీగా ఉండి సినిమాలలో కూడా ఎక్కువ కనిపించటం లేదు, ప్రస్తుతానికి జబర్దస్త్ షో తప మిగతా విషయాలమీద ఆమె దృష్తి పెట్టినట్టు కూదా కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆఫర్‌పై ఆమె సానుకూలంగా స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

English summary
Tollywood Actress, Nagari MLA Roja reacted on Ramgopal Varma's Offer in Laksmi's NTR Movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu