»   » ఆ రోజుల్లో దొంగతనంగా... చిరంజీవి, సురేఖ గురించి రోజా చెప్పిన సీక్రెట్స్!

ఆ రోజుల్లో దొంగతనంగా... చిరంజీవి, సురేఖ గురించి రోజా చెప్పిన సీక్రెట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నటి, ఎమ్మెల్యే రోజూ ఎవరూ ఊహించని విధంగా చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెం 150' సినిమా ప్రమోషన్ కోసం ఆయన్ను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. గతంలో పలు చిత్రాల్లో చిరంజీవితో కలిసి నటించిన రోజా.... అప్పటి రోజులను గుర్తు చేసుకున్నాు.

నేను మీ ఇంట్లో ఓ మెంబర్ లాగా, పిల్లలందరినీ ఎత్తుకుని, వారి బర్త్ డే లు సెలబ్రేట్ చేసాను మీ సిస్టర్ మ్యారేజీలోనే నాది, రాధిక అక్కదే హడావుడి మాదే... అంటూ అప్పటి రోజులను రోజా గుర్తు చేసుకున్నారు.


చిరంజీవి కూడా రోజాతో మనసు విప్పి మాట్లాడారు...నేను సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి 2007 వరకు కింగ్లీ లైఫ్, నల్లేరు మీద నడకలా సాగింది అంటూ తన ఫస్ట్ ఇన్నింగ్స్ సినీ జీవితాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.


సురేఖ అక్క శ్రీదేవి తర్వాత నువ్వేరా అనేది

సురేఖ అక్క శ్రీదేవి తర్వాత నువ్వేరా అనేది

అలాగే చిరంజీవి సతీమణి సురేఖతో తనకు ఉన్న అనుబంధాన్ని, ఫ్రెండ్షిప్ ను రోజా గుర్తు చేసుకున్నారు. నాకు బాగా గుర్తు ముఠా మేస్త్రీ, ఎంత ఘాటు ప్రేమయో సాంగ్ సమయంలో.... సురేఖ అక్క అయితే శ్రీదేవి తర్వాత నువ్వేరా సార్ పక్కన చేస్తుంటే చూడాలనిపిస్తుంది అంటూ నా గురించి చెప్పేదని రోజా గుర్తు చేసుకున్నారు.


అన్నప్రాసన రోజే ఆవకాయ తిన్నట్లైంది

అన్నప్రాసన రోజే ఆవకాయ తిన్నట్లైంది

మామూలుగానే చిరంజీవిగారితో డాన్స్ అనగానే యూనిట్ అంతా శివరింగ్, నన్ను యూనిట్ అంతా భయపెట్టేసంది. కానీ మీరొచ్చి కూల్ గా చేసేస్తుంటే ఏ టెన్షన్ లేకుండా చేసేసాను. నాకైతే ఆరోజు అన్నప్రాసన రోజే ఆవకాయ తిన్నట్లు అనిపించిందని రోజా చెప్పుకొచ్చారు.


ఆ రోజు దొంగతనంగా ముగ్గురం

ఆ రోజు దొంగతనంగా ముగ్గురం

మీతో యాక్ట్ చేసిన అందరికీ సురేఖ అక్క ఫ్రెండ్సిప్ మరువలేని జ్ఞాపకంలా ఉంటుంది. మనం ముగ్గురం దొంగతనంగా మఫ్లర్ చుట్టుకుని ప్యారడైజ్ కి వెళ్లి బిర్యానీ తినే వాళ్లం. అక్కకు ఆ బిర్యానీ చాలా ఇష్టం అంటూ అప్పటి రోజులను రోజా గుర్తు చేసకున్నారు.


చరణ్ నాకు పునర్జన్మనిచ్చిన తండ్రి

చరణ్ నాకు పునర్జన్మనిచ్చిన తండ్రి

చరణ్ కి నేను జన్మనిచ్చిన తండ్రి అయితే... యాక్టర్ గా పునర్జన్మనిచ్చిన ఫాదర్ చరణ్..... అని నా ఫీలింగ్. నేను అవకాశం వాడికి ఇవ్వలేదు. వాడే అందిపుచ్చుకున్నాడు. పట్టుబట్టి ఈ సినిమా చేసాడు. ఓ వైపు తను హీరోగా చేస్తూ ఎలాంటి పొరపాటు లేకుండా నిర్మాతగా బాగా హ్యాండిల్ చేసాడు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.


అందుకే నా కూతురు

అందుకే నా కూతురు

నా కూతురు సుస్మిత ఈ సినిమాకు స్టైలిస్ట్ గా పని చేయడానికి కారణం...తన నన్ను బాగా స్టడీ చేసిన పిల్ల, లండన్ స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగులో తర్పీదు అయింది. క్వాలిఫైడ్ పాప, తనకు తెలిసినంతగా మరెవరికీ నా గురించి తెలియదు. బాంబే వాళ్లను పిలిపించాం కానీ, వారి మాటతీరు, యాటిట్యూడ్ నచ్చలేదు. అపుడు చరణ్ అక్క నువ్వే చేయాలని చెప్పడంతో సుస్మిత చేసింది అని చిరంజీవి తెలిపారు.


రోజా! ఊరుకో, వాడిని గారు అంటావేంటి?

రోజా! ఊరుకో, వాడిని గారు అంటావేంటి?

ఓ సందర్భంలో రోజా మాట్లాడుతూ.. మీ ఇంట్లో అందరూ హీరోలైపోయారని, ప్రధానంగా బంగారు కోడిపెట్ట పాటను రామ్ చరణ్ గారు చేస్తున్నప్పుడు మీరెలా ఫీలయ్యారని చిరంజీవిని ప్రశ్నించారు. చిరంజీవి వెంటనే అందుకొని.. 'రోజా! ఊరుకో, వాడిని గారు అంటావేంటి? 'పిల్లాడిగా ఉన్నప్పుడు వాడిని ఎత్తుకున్నావు, చరణ్ అను చాలు' అని చెప్పారు.


వాళ్ల అమ్మ ఎక్కువ ముచ్చటపడింది

వాళ్ల అమ్మ ఎక్కువ ముచ్చటపడింది

తన బంగారు కోడిపెట్ట పాటను వాడు రీమేక్ చేసినప్పుడు ఆందోళన చెందినా, అద్భుతంగా చేశాడని, దానిని చూసిన తర్వాత చాలా గర్వపడ్డానన్నారు. చరణ్ బంగారు కోడి పెట్ట చేస్తుంటే ప్రౌడ్ అనిపించింది. నాకంటే వాళ్ల అమ్మ ఎక్కువ ముచ్చటపడింది. ఇద్దరిలో ఎవరు బాగా చేసారంటే నా కొడుకే అని చెప్పింది అని చిరంజీవి చెప్పుకొచ్చారు.


English summary
Roja reveals Chiru's secrets. Roja Interviews Chiranjeevi For Khaidi no 150 Promotion. Check out full details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu