»   » మారుతి మసాలా గట్టిగానే దట్టించినట్లున్నాడు (వీడియో)

మారుతి మసాలా గట్టిగానే దట్టించినట్లున్నాడు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దిల్ రాజు కన్ను పడిందంటే అక్కడేదో సక్సెస్ అయ్యే సినిమా ఉన్నట్లు లెక్క అనే విషయం తెలుగు ట్రేడ్ లో బాగా తెలుసు. అందుకే ఆయన డిస్ట్రిబ్యూట్ చేయటానికి ఇంట్రస్ట్ చూపే సినిమాలకు మిగతా వారు కూడా ఎంతరేటైనా పెట్టి తీసుకునేందుకు ఆసక్తి చూపతారు..ముందుకు వస్తారు. ఇప్పుడు తాజాగా ఆయన దృష్టి మారుతి కథ,స్క్రీన్ ప్లే అందిస్తున్న చిత్రం రోజులు మారాయి పై పడింది. అందుకే ఆయన ఉత్సాహంగా ఆ చిత్రంకి నిర్మాతగా ఉండటానికి ముందుకు వచ్చి భాగస్వామిగా చేరారు.

దిల్ రాజు సమర్పణలో ద‌ర్శకుడు మారుతి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందిస్తున్న చిత్రం 'రోజులు మారాయి'. మారుతి టాకీస్ బ్యాన‌ర్, శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యానర్‌ సమర్పణలో ఈ చిత్రం రూపొందుతుంది. జి.శ్రీనివాస‌రావు నిర్మిస్తున్నఈ చిత్రంతో ముర‌ళీ కృష్ణ ముడిదాని ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. చేత‌న్‌ మద్దినేని, పార్వతీశ‌మ్‌, కృతిక‌, తేజ‌స్వి ముఖ్యపాత్రల్లో న‌టిస్తున్నారు. గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణ సారథ్యం వహిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసారు.

ఈ సందర్భంగా దిల్‌ రాజు మాట్లాడుతూ ''రోజులు మారాయి చిత్ర నిర్మాణంలో మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ భాగమైంది. మారుతి కథ, స్క్రీన్‌ ప్లే అందించారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌, ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. మారుతి కథలు ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా రూపొందిస్తున్నాం'' అని అన్నారు.

rojulu marayi movie


ఇప్పటికే రోజులు మారాయి చిత్రం ఫస్ట్ లుక్ కి అనూహ్య‌మైన స్పంద‌న రావ‌టంతో ట్రేడ్ లో ఈ చిత్రానికి క్రేజ్ వ‌చ్చింది. ఈ ట్రైలర్ తో మరింత క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఈరోజుల్లో, బ‌స్ స్టాప్, ప్రేమ‌క‌థాచిత్రమ్ లాంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌కి సంగీతాన్ని అందించిన జె.బి ఈ చిత్రానికి సంగీతం చేశారు.

ఈ ఆడియోని త్వరలో ప్ర‌ముఖ సిని పెద్ద‌ల స‌మ‌క్షంలో విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జులై 7 న విడ‌ద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు. గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణ సారథ్యం వహిస్తుంది.

యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చేత‌న్ మ‌ద్దినేని, పార్వతీశం, కృతిక‌, తేజ‌శ్వి, ఆలీ, పోసాని కృష్ణముర‌ళి, రాజార‌వీంద్ర‌, వాసు ఇంటూరి, జ‌బ‌ర్దస్త్ అప్పారావు, శ‌శాంక్‌ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

English summary
Watch Rojulu Marayi Teaser starring Parvatheesam, Chetan, Tejaswi and Kruthika in the lead roles. Directed by Murali Krishna Mudidani. Produced by G. Srinivas Rao on Good Cinema Group Banner in association with Maruthi Talkies and Dil Raju's SVC banner. Music composed by JB.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu