»   » శేఖర్ కమ్ముల శిష్యుడి.... (‘దిల్ దివానా’ప్రివ్యూ)

శేఖర్ కమ్ముల శిష్యుడి.... (‘దిల్ దివానా’ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :శేఖర్ కమ్ముల చిత్రాల అంటేనే ఫీల్ గుడ్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్. దాంతో ఆయన వద్ద దర్శకత్వ శాఖలో పలు సినిమాలకు పని చేసిన కిరణ్ తుమ్మల దర్శకుడుగా పరిచయం అవుతున్నాడంటే ఓ వర్గం ప్రేక్షకులలో మంచి ఆసక్తే ఉంటుంది. దాన్ని ఎంతవరకూ రీచ్ అవుతాడనేది ఈ రోజు తెలియనుంది. ముక్కోణపు ప్రేమ కథగా రూపొందిన ఈ చిత్రం సున్నితమైన భావోద్వేగాలతో సాగుతుందని చెప్తున్నారు.

Romance genre'Dil Deewana' preview

సూర్య (రాజ్‌ అర్జున్‌) ఓ ఫార్మా సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. శ్రీలక్ష్మి (కృతిక సింఘాల్‌) ఎంఎన్‌సీలో పని చేస్తుంటుంది. వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. జీవితంలో స్థిరపడనిదే పెళ్లి చేసుకోకూడదనేది వీరి ఆలోచన. మరోవైపు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే సమస్యలు ఎదురవుతాయనే భయం ఒకటి. మరేం చేశారనేది తెరపై చూడాల్సిందే. సంతోష్‌ (రోహిత్‌) సహాయ దర్శకుడిగా ఉంటూ దర్శకుడిగా మారేందుకు అవకాశాల కోసం చూస్తుంటాడు. దివ్య (నేహాదేశ్‌పాండే) ఓ కాస్ట్యూమ్‌ డిజైనర్‌. వీరిద్దరి మధ్య ప్రేమకి దివ్య తండ్రి అడ్డుపడతాడు. మరి వీరి కథ ఎలా సుఖాంతమైందో సినిమాలో చూడాల్సిందే.

దర్శకుడు తుమ్మ కిరణ్‌ మాట్లాడుతూ... ''రెండు జంటల జీవితాల్ని సినిమాలో చూపించబోతున్నాం. రెండూ సమాంతరంగా సాగుతూ ఆసక్తి రేకెత్తించేలా ఉంటాయి. సమాజంలో రోజూ చూస్తున్న సమస్యల్నే సినిమాలో చూపించబోతున్నాం. వీటికి పరిష్కారాన్ని చూపించే ప్రయత్నమే మా సినిమా. నాగబాబుగారు పోషించిన పాత్ర సినిమాకి కీలకం'' అన్నారు.

బ్యానర్: శ్రీ భావనా ఫిలింస్
చిత్రం: దిల్‌ దివానా
సంస్థ: శ్రీ భావన ఫిలింస్‌
తారాగణం: రాజ్‌ అర్జున్‌, రోహిత్‌, కృతిక సింఘాల్‌, నేహా దేశ్‌పాండే, నాగబాబు, వేణు, ధన్‌రాజ్‌ తదితరులు
సంగీతం: రామ్‌ నారాయణ్‌
నిర్మాత: రాజా రెడ్డి
దర్శకత్వం: తుమ్మ కిరణ్‌
విడుదల తేదీ: 07,పిభ్రవరి,2014

English summary
Dil Deewana, made by Sekhar's disciple Tumma Kiran now gearing up to release worldwide on February 7. produced by Raja Reddy, belongs to romance genre. Newbies Raj Arjun Reddy, Rohit Reddy, Abha Singhal and Neha Deshpande are playing lead roles in the film, while Nagendra Babu and Dhanraj reprise important roles. 
Please Wait while comments are loading...