»   »  లేటెస్ట్: శ్రీను వైట్లపై కేసు విషయమై రూప వైట్ల ఏమంటోందంటే

లేటెస్ట్: శ్రీను వైట్లపై కేసు విషయమై రూప వైట్ల ఏమంటోందంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీను వైట్ల భార్య రీసెంట్ గా హెరాస్ మెంట్ కేసు విషయమై వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అన్ని ప్రముఖ మీడియాల్లోనూ ఇది హైలెట్ వార్తగా వచ్చింది. ఈ విషయమై అందరూ షాక్ కు గురి అయ్యారు. ఎందుకంటే వీరిద్దరూ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ అని చెప్పుకుంటూంటారు కాబట్టి.

అసలేం జరిగింది, అంతలా ... 498 A కేసుని తన భర్తపై పెట్టాల్సినంత ఎక్సట్రీమ్ స్టెప్ తీసుకోవాల్సిన పరిస్ధితులు ఏమొచ్చాయి అనే విషయమై మీడియా వర్గాలు ఎంక్వైరీ మొదలెట్టాయి. అయితే రూప వైట్ల చాలా ఆశ్చర్యకరంగా ఈ న్యూస్ విషయమై ఖండన చేసారు.

రూపవైట్ల ఏమంటారంటే..తాను తాను తన భర్త శ్రీను వైట్లపై ఏ విధమైన కేసు ఫైల్ చేయలేదని అన్నారు. అయితే తాను పోలీసులకు కంప్లైన్ చేసానని అన్నారు. అదీ కూడా కేవలం శ్రీను వైట్ల తనను అక్టోబర్ 12, 13 తేదీలలో కొట్టారని మాత్రమే అని అన్నారు.

అలాగే ఈ సంఘటన అక్టోబర్ 13న జరిగిందని, చిత్రంగా అక్టోబర్ 26న వెలుగులోకి వచ్చిందని, అదీ రూపావైట్ల..కంప్లైంట్ విత్ డ్రా చేసుకోవటానికి పోలీస్ స్టేషన్ కి వచ్చినప్పుడు మాత్రమే అని తెలిసింది.

బ్రూస్ లీ పరాజయం తో వచ్చిన డిస్ట్రబెన్సెస్ ..ఈ జంట మధ్య పొరపచ్చాలు తెచ్చి ఉండవచ్చని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు తెలిసినదాన్ని బట్టి బ్రూస్ లీ రిలీజ్ ముందే ఈ జంట మధ్య చిన్న గొడవలు వచ్చి, ఆవేశంలో పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాయని అర్దమవుతోంది.

స్లైడ్ షోలో... మిగతా విశేషాలు

కంప్లైంట్

కంప్లైంట్

పోలీస్ లకు రూప ఇచ్చిన కంప్లైంట్ ని బట్టి...శ్రీను వైట్ల ఆమెను మానసికంగా, శారీరకంగా ఇబ్బందికు గురి చేసారు. అలాగే పనివాళ్ల ముందు, పిల్లల ముందు ఆమెను, ఆమె తల్లి తండ్రులను, స్నేహితులను తిట్టారు, దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

స్టైలిస్ట్

స్టైలిస్ట్

రూప గత కొంతకాలంగా శ్రీను వైట్ల చిత్రాలు అన్నిటికీ స్టైలిస్ట్ గా చేస్తోంది. అయితే బ్రూస్ లీకి ఆమె పనిచేయలేదు.

సమంతకు

సమంతకు


సమంత తొలి రోజుల్లో ఆమెకు ఎక్సక్లూజివ్ స్టైలిస్ట్ గా పనిచేసింది.

ముగ్గురు

ముగ్గురు


ఈ జంటకు ముగ్గురు ఆడపిల్లలు. వీరు దూకుడు, బాద్షా చిత్రాల్లో కనిపిస్తారు

కౌన్సలింగ్

కౌన్సలింగ్

పోలీసులు, ఇండస్ట్రీ పెద్దలు ఇచ్చిన కౌన్సిలింగ్ తో తిరిగి వీరిద్దరూ గతంలోలాగ హ్యాపీ జీవితాన్ని గడుపుతారని ఆశిద్దాం

English summary
When approached to know what exactly led to the extreme step of filing 498 A on the director, Roopa surprised the media men by denying the news. Roopa said that she did not file any case on Sreenu Vaitla. However, she agreed that she 'complained' to the police that Sreenu Vaitla has beaten her up on October 12th and again on October 13th.
Please Wait while comments are loading...