twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్‌ బాబు, జూ ఎన్టీఆర్‌ లపై ఎందుకు..రోశయ్య

    By Srikanya
    |

    జూ‌ ఎన్టీఆర్‌, మహేష్‌ బాబు, వాళ్ళ నాన్న కృష్ణ ఎలాంటి ప్రకటనలు చేయకున్నా అలాంటి వారిపై దాడులు ఎందుకు చేసినట్టని రోశయ్య ప్రశ్నించారు. అదే మోహన్‌బాబు, చిరంజీవి సమైక్యవాదులమని చెప్పడంతో ఆగ్రహించి దాడులు చేసినట్టు తెలిసింది. మంత్రులు గాదె వెంకటరెడ్డి, శత్రుచర్ల విజయరామారాజుతో కలసి సచివాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఆయన ఈ ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే షూటింగుపై దాడి గురించి మోహన్‌బాబు తన కుమారులతో వచ్చి నాకు ఫిర్యాదు చేశారు. శాంతియాత్ర చేస్తామంటే వద్దని వారించాను. షూటింగులపై దాడులకు భయపడి కొందరు వ్యక్తులు-ఇలాగే తమపై ఆగ్రహావేశాలు చూపిస్తే మద్రాస్‌లో మాకు ఇళ్లున్నాయి, మళ్లీ అక్కడికే వెళ్తా మంటున్నారని సీఎం రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

    ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంత డబ్బున్నా రాత్రికి రాత్రి సినీపరిశ్రమ అభివృద్ధి చెందదని అన్నారు. సినీపరిశ్రమ చెన్నై నుంచి ఇక్కడకు తరలి రావడానికి పలువురి కృషి ఉందన్నారు. రాష్ట్ర తొలి సీఎం నీలం సంజీవరెడ్డి పరిశ్రమ తరలి రావడానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. బ్రహ్మానందరెడ్డి హయాంలో విజయవాడలో బ్రహ్మానందరెడ్డి చలనచిత్రపురి పేరుతో కొంత ప్రయత్నించగా ఒక అడుగు ముందకుపడిందన్నారు. చెన్నారెడ్డి సీఎం అయ్యాక మద్రాసు వెళ్లి పలుదఫాలుగా చర్చలు జరిపారని వివరించారు. సినీరంగం కష్టాల్లో ఉందని చెబితే దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సినీ ప్రముఖులను పిలిపించి కూర్చొబెట్టి సమస్యలు పరిష్కరించారని రోశయ్య చెప్పారు. సినీ రంగంలోనూ అన్ని ప్రాంతాల వారు ఉన్నారన్నారు.

    సినీ పరిశ్రమ ఒక్క నటునితో నడిచేది కాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. లైట్‌ బాయ్స్‌ మొదలుకొని చాలా మంది అందులో పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో 70 నుంచి 80 శాతం మంది స్థానికులకే ఉపాధి కలుగుతుందని వివరించారు. దురదృష్టవశాత్తూ ఇటీవలి సంఘటనలతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయంటూ పలువురు హీరోల షూటింగులపై జరిగిన దాడులను సీఎం ప్రస్తావించారు.

    పరిశ్రమకు చెందిన వ్యక్తులు సంపదను మూటకట్టుకొని వెళ్లిపోతున్నారని కొందరు విమర్శించటాన్ని రోశయ్య తప్పుపట్టారు. 'సినీ రంగంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారెంతమందో ఉన్నారు. పాతతరంలో కాంతారావు, త్యాగరాజు, ప్రభాకరరెడ్డి, ఇప్పుడు హీరో నితిన్‌, నిర్మాతల్లో దిల్‌రాజు,సుధాకర్‌రెడ్డి, దర్శకుల్లో శంకర్‌, సురేందర్‌ రెడ్డి, పాటల రచయితల్లో నారాయణరెడ్డి, దాశరథి, అశోక్‌ తేజ, చంద్రబోస్‌ లు ఈ ప్రాంతానికే చెందినవారు. చిత్ర పరిశ్రమ చాలా కీలకమైంది. ఎంతోమందికి ఉపాధి కల్పించే పరిశ్రమ తరలిపోతే నష్టం రాష్ట్ర ప్రజలకే కాబట్టి ఆలోచించి, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరముంద'ని సీఎం తెలిపారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X