»   » నాగార్జున నిర్మాత: శ్రీకాంత్ కొడుకు హీరోగా ఎంట్రీ అదుర్స్ (ఫోటోస్)

నాగార్జున నిర్మాత: శ్రీకాంత్ కొడుకు హీరోగా ఎంట్రీ అదుర్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా పరిచయమవుతున్న 'నిర్మలా కాన్వెంట్‌'. నాగార్జున సొంత సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ విషయమై నాగార్జున తన సోషల్ నెట్వర్కింగ్ పేజీలో అఫీషియల్ ప్రకటన చేసారు. మా బేనర్లో రోషన్‌ను హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది, నిర్మల కాన్వెంట్ చిత్ర ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ అన్నారు నాగార్జున.

ఈ సందర్భంగా రోషన్‌కు సంబంధించిన ఫోటోలు నాగార్జున విడుదల చేసారు. నూనూగు మీసాలతో లవర్ బాయ్‌గా ఆకట్టుకునే లుక్‌తో రోషన్ ఆకట్టుకుంటున్నాడు.

శ్రీకాంత్-ఊహ దంపతులకు ముగ్గురు సంతానం. కుమారులు రోషన్, రోహన్, కుమార్తో మేధ. పెద్ద కొడుకు రోషన్ వయసు 20 సంవత్సరాల లోపే... ఇతన్ని క్యూట్ లవ్ స్టోరీ ద్వారా వెండి తెరకు హీరోగా పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

జై చిరంజీవ, దూకుడు, రోబో వంటి చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయా శర్మ ఈ చిత్రంలో రోషన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. కోటి తనయుడు రోషన్ సాలూరి ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు.

జైపూర్ లో మొదటి షెడ్యూల్, మెదక్ లో రెండో షెడ్యూల్ జరుపుకున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ సెప్టెంబర్ 7 నుండి అరకులో జరుగుతుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు.

ఈ చిత్రంలో ఇంకా ఆదిత్య మీనన్, సత్యకృష్ణ, అనితా చౌదరి, తాగుబోతు రమేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రోషన్ సాలూరి, సినిమాటోగ్రఫీ: ఎస్.వి.విశ్వేశ్వర్, నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్, మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్, దర్శకత్వం: జి.నాగకోటేశ్వరరావు.

రోషన్

రోషన్


లవర్ బాయ్ లుక్ తో రోషన్ ఆకట్టుకుంటున్నాడు.

టీనేజీ లవ్ స్టోరీ

టీనేజీ లవ్ స్టోరీ


రోషన్ నటిస్తున్న నిర్మలా కన్వెంట్ ఓ టీనేజీ లవ్ స్టోరీతో సాగుతుంది.

సూపర్బ్ లుక్

సూపర్బ్ లుక్


రోషన్ మీద చిత్రీకరించిన ఫోటో షూట్ సూపర్బ్ గా ఉంది.

శ్రీకాంత్-ఊహ

శ్రీకాంత్-ఊహ


శ్రీకాంత్ ఊహ దంపతుల పెద్ద కుమారుడు రోషన్. వయసు 20 సంవత్సరాల లోపే...

English summary
"I am very happy to introduce Roshan(Srikanths Son) in my new production ‪Nirmala Convent‬..A fresh n pure love story. .Love in progress." Akkineni Nagarjuna said.
Please Wait while comments are loading...