»   »  అలా అనుకుంటే షకీలాను పెట్టి సినిమా చేస్తా

అలా అనుకుంటే షకీలాను పెట్టి సినిమా చేస్తా

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హైదరాబాద్ : డబ్బు సంపాదన కోసం పరిశ్రమకు రాలేదు. ఒక వేళ దాని కోసమే వస్తే...షకీలాను పెట్టి సినిమా తీసేవాడిని.. అంటున్నారు రొటీన్ లవ్ స్టోరీ దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'రొటీన్‌ లవ్‌స్టోరీ'. సందీప్‌కిషన్‌, రెజీనా హీరో,హీరోయిన్స్ గా నటించారు. చాణక్య భూనేటి నిర్మాత. ఈ చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేయనున్నారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

  దర్శకుడు చిత్రం విశేషాల్ని చెబుతూ ''పద్దెనిమిదేళ్ల అబ్బాయి, అమ్మాయి మధ్య పుట్టిన ప్రేమ కథ ఇది. ఆ వయసులో వారి ఆలోచనలు ఎలా ఉంటాయో.. వాటినే కథగా మలిచాం. అందరి ప్రేమకథా ఇంచుమించు ఒకేలా ఉంటుంది. అలకలు, సర్దుబాట్లూ, చిన్నచిన్న గొడవలు లేకపోతే పరిపూర్ణం కాదు. పెళ్లయ్యాక ప్రేమించే విధానంలోనూ మార్పు వస్తుంది. ఇవన్నీ సహజంగా సంభవించే పరిణామాలు. అందుకే మా సినిమాకి 'రొటీన్‌ లవ్‌స్టోరీ' అనే పేరు పెట్టాం'' అన్నాపు,


  అలాగే ప్రేమకథలంటే కేవలం ద్వందర్థాల కథలు కాదు. అలా సినిమా చేయడమంటే దొడ్డిదారిలో డబ్బు సంపాదించడమే. కళను నమ్ముకొని సినిమాపై ఉన్న ప్యాషన్‌తో ఈ సినిమా చేశాను. ఇందులో ఎలాంటి ద్వందర్థాలు ఉండవు. రొటీన్ లవ్‌స్టోరీ అంటున్నారని ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్‌కు వస్తారు. అలా వచ్చిన వారు వంద శాతం సంతృప్తితో హాయిగా నవ్వుకుంటూ బైటికి వెళ్ళే సినిమా ఇది.మనం వినే చాలా ప్రేమకథలు రొటీన్‌గా వుంటూ బోర్‌గా అనిపిస్తాయి. అందుకే మా చిత్రానికి 'రొటీన్ ప్రేమకథ' అని పెట్టాం. కానీ కథ నడిపించిన విదానం కొత్తగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కొత్త అనుభూతినిచ్చే సినిమా ఇది అన్నారు.

  ప్రేమ అనే భావన అందరిలోనూ ఒకేలా ఉంటుంది. ఇష్టమైన వ్యక్తి ఎదురుపడినప్పుడు, వారితో మాట్లాడుతున్నప్పుడు... ఆఖరికి గొడవపడుతున్నప్పుడు దాదాపు అందరూ ఒకేలా ప్రవర్తిస్తారు. ప్రేమికుల తగాదాలు ఎదుటివారికి సిల్లీగా అనిపించినా.. ఆ జంట మాత్రం చాలా సీరియస్‌గానే తీసుకొంటుంది. ఆ తమాషాలన్నీ మా సినిమాలో చూడొచ్చు అంటున్నారు ప్రవీణ్‌ సత్తారు. మిక్కీ జె.మేయర్‌ స్వరాలు ఆకట్టుకొంటాయి అన్నారు.

  English summary
  Director Praveen Sattaar's 'Routine love story' involves all the elements like a boy meeting a girl, falling in love and the differences arising between them, but the treatment given to these elements stands out to be a highlight. He has chosen Actor Sandeep Kishan who got into fame with the films like ‘Snehageetam’ and ‘Prasthaanam’ as his hero and Rejina as his heroine.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more