»   » కారు ప్రమాదంలో మిస్టర్ బీన్ మృతి.. సోషల్ మీడియాలో గందరగోళం..

కారు ప్రమాదంలో మిస్టర్ బీన్ మృతి.. సోషల్ మీడియాలో గందరగోళం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

మిస్టర్ బీన్‌గా సుపరిచితుడైన బ్రిటన్ నటుడు రోవాన్ అట్కిన్‌సన్ ఇకలేరు అంటూ వచ్చిన వార్తలు అభిమానులను షాక్ గురిచేశాయి. ఈ నెల 18న మిస్టర్ బీన్ చనిపోయాడు. అతని ఆత్మకు శాంతి కలుగాలంటూ చేసిన ట్వీట్ మీడియాను పరుగులు పెట్టించింది. ఈ వార్తపై ఆరా తీయగా ఫేక్ ట్విట్టర్ అకౌంట్ అని తేలింది. మిస్టర్ బీన్ కారు ప్రమాదంలో మిస్టర్ బీన్ మరణించారు నకిలీ అకౌంట్‌లో ఓ పోస్ట్ ప్రత్యక్షమైంది.

ట్విట్టర్‌లో ఫేక్ న్యూస్..

ట్విట్టర్‌లో ఫేక్ న్యూస్..

ట్విట్టర్‌లో ఫేక్ న్యూస్ లీక్ కావడం, వెంటనే దానిని 3 లక్షల మంది లైక్ చేయడం జరిగింది. దాంతో ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్తను ప్రముఖ పత్రిక సన్ కూడా బ్రేకింగ్ న్యూస్ వేయడంతో అంతా నిజమేనని భావించారు. మిస్టర్ బీన్ మృతిపై అభిమానుల నుంచి సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ఈ ట్వీట్‌కు మార్ఫింగ్ చేసిన వీడియో కూడా లింక్ చేయడం వివాదాస్పదమైంది.

చైనాలో మిస్టర్ బీన్ బిజీ

చైనాలో మిస్టర్ బీన్ బిజీ

ఈ వార్త వైరల్‌గా మారుతున్న సమయంలో మిస్టర్ బీన్ చైనాలో తన సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు. టాప్ ఫన్నీ కమెడియన్ పేరుతో రూపొందిన చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్నారు. ఈ చిత్రంలో మిస్టర్ బీన్ అతిథి పాత్రను పోషించారు. తాను చైనాలో ఉన్నట్టు ధ్రువీకరించే విధంగా కొన్ని వారసత్వ కట్టడాల వద్ద దిగిన ఫొటోను తన ఐఫోన్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

2016లో కూడా ఇలాంటి వార్తే..

2016లో కూడా ఇలాంటి వార్తే..

2016లో కూడా మిస్టర్ బీన్ చనిపోయినట్టు ఫేక్ న్యూస్ వచ్చింది. శాన్ ఫ్రానిస్కోలోని తన ఇంటిలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారమైంది. వెంటనే ఆ వార్తకు పలువురు రిప్ రోవాన్ అట్కిన్‌సన్ అని సంతాపాన్ని తెలిపారు.

ఇలాంటి వార్తలు కొత్తేమీ కాదు

ఇలాంటి వార్తలు కొత్తేమీ కాదు

ఇంటర్నెట్‌లో ప్రముఖ మరణానికి సంబంధించి తప్పుడు వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అమితాబ్ బచ్చన్, అర్నాల్డ్, జాకీ చాన్ చనిపోయారంటూ వార్తలు వచ్చాయి.

English summary
Rowan Atkinson was declared dead in several false reports few days ago. A tweet on his supposed death went viral. Rowan Atkinson was also the target of a death hoax in 2016, after a Facebook page titled 'R.I.P. Rowan Atkinson'. That news claimed that the actor was found unconscious at his home in San Francisco.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu