»   » 'రౌడీ' సినిమా లాభాల్లోనే ఉందంటున్న మంచు విష్ణు

'రౌడీ' సినిమా లాభాల్లోనే ఉందంటున్న మంచు విష్ణు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rowdy movie
హైదరాబాద్: 'రౌడీ' చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయపథంలో సాగుతుందని, సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు వస్తున్నాయని అంటున్నారు ఆ చిత్ర హీరో మంచు విష్ణు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మోహన్ బాబు, మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'రౌడీ'.

సినిమా గురించి విష్ణు మాట్లాడుతూ 'రౌడీ చిత్రం నటుడిగా నాకు ఎంతటి మంచి పేరు తెచ్చి పెట్టిందో...మా సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు కూడా అంతే ఆనందాన్ని ఇచ్చింది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నటించడం నాకొక చక్కని అనుభూతినిచ్చింది. ముఖ్యంగా వర్మ మా నాన్నగారి పాత్రను తీర్చి దిద్దిన తీరు అద్భుతం' అన్నారు.

'రాయల సీమ రామన్న చౌదరి తర్వాత మా నాన్నగారిని అంత రౌద్రంగా చూపిన చిత్రమిది. ఈ సినిమాకున్న మరో ప్రత్యేకత ఏమిటంటే...మా నిర్మాతలు ఈ సినిమా నిర్మాణానికి ఖర్చు చేసినదంతా...కేవలం తొలి వారం కలెక్షన్ల రూపంలోనే లభించడం. ఆ విషయం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది' అన్నారు.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం, మోహన్ బాబు విగ్గులేకుండా ఒరిజినల్ గెటప్‌లో పవర్ ఫుల్ సీమ ఫ్యాక్షనిస్టు పాత్రలో కనిపించడం, ట్రైలర్లు, ప్రోమోలు ఆసక్తికరంగా ఉండటంతో నిన్న విడుదలైన ఈచిత్రం తొలి రోజు రూ. 4.13 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఎ.వి. పిక్చర్స్ పతాకంపై రూపొందించబడిన ఈ చిత్రంలో మంచు విష్ణు - శాన్వి జంటగా నటించారు. సహజనటి జయసుధ ఈ చిత్రంలో చాలాకాలం తరువాత మోహన్‌బాబు సరసన నటించారు.

English summary
Rowdy movie in Profits zone Producers and Distributors of team are Very happy with collections Rowdy movie directed by Ram Gopal varma Produced by A. v pictures.
Please Wait while comments are loading...