»   » నాగార్జునకు సంబంధం లేదు, అందుకే మ్యూజిక్ డైరెక్షన్ మానేసా: ఆర్పీ

నాగార్జునకు సంబంధం లేదు, అందుకే మ్యూజిక్ డైరెక్షన్ మానేసా: ఆర్పీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్. ఒకానొక సమయంలో వరుస అవకాశాలు, వరుస హిట్లతో దూసుకెళ్లిన ఆయన ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్షన్‌కి పూర్తిగా దూరంగా ఉంటున్నారు.

అయితే ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ డైరెక్షన్ మానేయడానికి నాగార్జున కారణం అనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. దీనిపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు ఆర్పీ. తాను ఈ రంగం నుండి తప్పుకోవడానికి కారణం 'నేనున్నాను' సినిమా సమయంలో ఎదుర్కొన్న అనుభవమే అన్నారు.


నన్ను తీసుకుని తప్పించారు

నన్ను తీసుకుని తప్పించారు

‘నేనున్నాను' సినిమా సమయంలో తనకు ఎదురైన అనుభవమే నేను మ్యూజిక్ డైరెక్షన్ నుండి తప్పుకోవడానికి కారణం. ఆ సినిమాకు సంగీత దర్శకుడిగా మొదట నన్నే తీసుకున్నారు. కొన్ని ట్యూన్స్‌ కూడా ఇచ్చాను. అయితే కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ సినిమాకు సంబంధించిన ఓ పెద్ద వ్యక్తి (పేరు చెప్పను) నాదగ్గరకు వచ్చి నిన్ను మ్యాజిక్‌ డైరెక్టర్‌గా తీసుకోవడం లేదు అన్నారు.


ఎందుకు అని అడిగితే నా వల్ల నష్టం అన్నారు

ఎందుకు అని అడిగితే నా వల్ల నష్టం అన్నారు

ఎందుకు తీసుకోవడం లేదు అని అడిగితే .... నీ వల్ల సినిమాకు బిజినెస్‌ జరగడం లేదని చెప్పారు. అప్పుడే నిర్ణయించుకున్నాను ఇక మ్యూజిక్‌ చేయకూడదని. నిర్మాత సురక్షితంగా ఉంటే ఎంతో మంది బతుకుతారు. అలాంటి నిర్మాతకు డబ్బులు రాకుండా నేను కారణం కాకూడదనే తప్పుకున్నట్లు ఆర్పీ తెలిపారు.


నాగార్జునకు సంబంధం లేదు

నాగార్జునకు సంబంధం లేదు


‘నేనున్నాను' సినిమా సమయంలో ఇది జరుగడం, అందులో నాగార్జున హీరో కావడంతో అందరూ నాగార్జున గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని అనుకుంటున్నారు. కానీ ఆయనకు, నేను మ్యూజిక్ డైరెక్షన్ మానేయడానికి ఎలాంటి సంబంధం లేదు అని తెలిపారు.


పవన్ కళ్యాణ్ సినిమాకు

పవన్ కళ్యాణ్ సినిమాకు

గుండుంబా శంకర్ సినిమాకు నేను పని చేయాల్సి ఉంది. సినిమా ఒప్పుకునేప్పుడే నాకు యూఎస్ ట్రిప్ ఉందని చెప్పాను. నెల రోజుల పాటు నేను యూఎస్ ఏలో ఉండటం వల్ల ఈ విషయంలో సినిమా మేనేజర్ల మిస్ కమ్యూనికేషన్ మూలంగా సినిమాకు వేరే వారిని తీసుకున్నారని ఆర్పీ తెలిపారు.

English summary
Check out RP Patnaik interview details. Ravindra Prasad Patnaik is a South Indian music composer with about 60 films to his credits in three south Indian languages. He won three Filmfare Awards and three Nandi Awards.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu