»   » ఫర్మిషన్ లేకుండా పాటను వాడారు: ఆర్‌.పీపట్నాయక్ ఫైర్ (వీడియో)

ఫర్మిషన్ లేకుండా పాటను వాడారు: ఆర్‌.పీపట్నాయక్ ఫైర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్ నిర్మాతల వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్‌పీ పట్నాయక్ చిత్రం ... తులసీ దళం (విడుదల కాలేదు)కు అందించిన ఆడియో ట్రాక్‌లను అత్తో అత్తమ్మ కూతురో సీరియల్ నిర్మాతలు అనుమతి లేకుండా వినియోగించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు.

ఆ సీరియల్ నిర్మాతలు దుర్వినియోగం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. యాభై లక్షలు డిమాండ్ చేస్తున్నారు. ఆయనేం అన్నారో మీరూ ఇక్కడ చూడండి.

ఈ విషయమై ఆర్ పీ మాట్లాడుతూ‘ నేను కంపోజ్ చేసిన తులసీ దళం సినిమాలోని ఓ పాటను సీరియల్ నిర్మాతలు నా అనుమతి లేకుండా వాడుకున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ వ్యవహారంపై రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దావా వేస్తాను. ఈ వ్యవహారంపై సీరియల్ నిర్మాతలు, దర్శకులకు త్వరలో నోటీసులు పంపిస్తాన'న్నారు. అత్తో అత్తమ కూతురో సీరియల్ జెమినీ టీవీలో ప్రసారం అవుతుంది.

ఇదిలా ఉంటే గతంలో...

ఆర్పీ పట్నాయిక్ తన పాటలు కాపీ కొట్టి ఎదిగిపోతున్నాడంటూ కంప్లైంట్ చేస్తోంది విజయనగరంకు చెందిన గడివిడి లక్ష్మి. ఆమె తన శ్రీ విజయ దుర్గా బుర్రకథ ట్రూప్ లో పాడిన అనేక పాటలు ఆర్పీ మొహమాటం లేకుండా కాపీ కొట్టి సినిమాల్లో ఉపయోగించుకున్నాడని ఆరోపిస్తోంది ఆమె. దాదాపు పన్నెండేళ్ళ క్రితం తాను ఆర్పీకి ఓ క్యాసెట్ ఇచ్చి ఎంకరేజ్ చేయమని అడిగానని ఆయన వాటిని వాడుకున్నారంటోంది.

RP Patnaik warning to Tv Channel

ఇక ఆయన ట్యూన్ చేసిన "రాను రానుంటోంది చిన్నదో..రాములోరి గుడికొచ్చె చిన్నది","గాజు వాక పిల్లా.." వంటి అనేక జానపద పాటలు తనవేనని కావాలిస్తే ఆధారాలతో సహా నిరూపిస్తానంటూ ఓ టీవీ ఛానెల్ లో ఇంటర్వూ ఇచ్చింది. అయితే పోతే పోనీ అని, తను చెప్పినా నమ్మరేమో అని తాను ఈ విషయాన్ని ఇష్యూ చేయలేదని అన్నారు.

అయితే రెండు రోజుల క్రితం ఆర్పీ ఫోన్ చేసి కొత్త పాటలు ఏమన్నా చేసారా..ఇస్తే మీకు టీవీ సీరియల్లో మంచి వేషం ఇస్తానని ఆశపెట్టడం రగిలించిందని ఆవేదనతో చెప్పింది. ఇక దీనిపై ఆర్పీ ఇప్పటివరకూ ఏ విధమైన కామెంటు చేయలేదు. గతంలో మనసంతా నువ్వే సమయంలో కూడా ఆర్పీ పై ట్యూన్స్ కాపీచేస్తున్నాడంటూ గొడవలు వచ్చాయి.

English summary
RP Patnaik Warns TV channels in a press meet, He warned all the Telugu TV serials makers for using cinema songs in serials without rights.
Please Wait while comments are loading...