twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR: సీఎం జగన్మోహన్ రెడ్డితో రాజమౌళి.. చర్చలకు గ్రీన్ సిగ్నల్.. ఈసారి ఏం మాట్లాడబోతున్నారంటే?

    |

    దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి 2 తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. డివివి.దానయ్య నిర్మాతగా 450 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ సినిమా లో అగ్ర హీరోలు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ పవర్ ఫుల్ పాత్రలలో నటించారు. అయితే సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని చిత్ర దర్శకుడు రాజమౌళి ఎంతో నమ్మకంగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పెట్టిన పెట్టుబడులు వెనక్కి తేవాలి అంటే ప్రస్తుతం నెలకొన్న జీవోతో కాస్త కష్టమే అని తెలుస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాస్త ఆందోళనగా ఉన్నారు. ఇక ప్రత్యేకంగా రాజమౌళి నిర్మాతతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ సీఎం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

     అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి..

    అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి..

    నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇద్దరు కూడా మొదటిసారి కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులలో కూడా అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. ఒకవైపు దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించడం ఒక ఎత్తయితే మరొకవైపు ఇద్దరు కూడా అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ పాత్రలలో నటించడం మరొక ఎత్తు అనే చెప్పాలి. దానికి తోడు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కి ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు.

    తొలి రోజే 100 కోట్లు

    తొలి రోజే 100 కోట్లు

    దర్శకుడు రాజమౌళి స్టార్ క్యాస్టింగ్ తోనే సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాడు. ఇక సినిమా షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో కూడా స్పీడ్ గానే ఆలోచించాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తున్నారు. ఇక ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళం కన్నడ హిందీ లో కూడా మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే ఈ సినిమా 100 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

    భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్

    భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్

    ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. అసలైతే ఈ సినిమాను గత ఏడాదిలోనే విడుదల చేయాల్సింది. కానీ కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేసుకోక తప్పలేదు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి జనవరి 7వ తేదీన ఆల్మోస్ట్ విడుదల అవుతోంది అనుకొన్న సందర్భంలో మళ్ళీ వాయిదా పడింది. ఇక ఇప్పుడు మార్చి 25 వ తేదీన ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 900 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.

    సీఎం అపాయిట్మెంట్

    సీఎం అపాయిట్మెంట్

    అయితే సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో దాదాపు 240 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక తెలంగాణలో ప్రస్తుతం అన్ని సినిమాలకు అన్ని అంశాలు అనుకూలంగానే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఆ ప్రభావం ఇదివరకు వచ్చిన సినిమాలపై గట్టిగానే పడింది. ఇక అలంటి ప్రభావం RRR పై పడకూడదు నిర్మాత దానయ్య, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ని కలవబోతున్న తెలుస్తోంది. ఇటీవల సీఎం అపాయింట్మెంట్ కోసం సంప్రదించగా వారికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం.

    Recommended Video

    RRR Moivie : Ram Charan Is Calm But Jr NTR Is A Tsunami - SS Rajamouli | Filmibeat Telugu
     సీఎంతో చర్చల కోసం..

    సీఎంతో చర్చల కోసం..


    అయితే ఈ మీటింగ్ లో దర్శకుడు రాజమౌళి ఎక్కువ షోలకు అలాగే స్పెషల్ హైక్స్ కు అనుమతి ఇవ్వాలని అంతేకాకుండా ప్రీమియర్ షోలకు కూడా పర్మిషన్ ఇవ్వాల్సిందిగా సీఎంను కొరనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు చాలా మంది సినీ ప్రముఖులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి వారి అభిప్రాయాలను తెలియజేసి ఇండస్ట్రీకి అండగా ఉండాలని కోరారు. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం నుంచి ఆమోదయోగ్యమైన నిర్ణయం అయితే రాలేదు. మరి రాజమౌళికి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.

    English summary
    RRR director SS Rajamouli and danayya got a meeting appointment with ap cm
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X