twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కుక్క తోక వంకర.. తనపైనే సెటైర్లు వేసుకొన్న రాజమౌళి.. ఎన్టీఆర్, చెర్రీ ఒప్పుకోకపోతే..!

    |

    బాహుబలి తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం RRR. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 14న సినిమా గురించి అధికారికంగా ప్రకటన చేయడానికి నిర్వహించిన ప్రెస్ మీట్‌కు రాజమౌళి, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, నిర్మాత దానయ్య హాజరయ్యారు. ఈ ప్రెస్ మీట్లో చాలా ఓపికగా, నింపాదిగా, సహనంతో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాజమౌళి వెల్లడించిన ఓ ఆసక్తికరమైన సమాధానం మీ కోసం..

     RRR మూవీ గ్రాఫిక్స్ గురించి

    RRR మూవీ గ్రాఫిక్స్ గురించి

    బాహుబలి తర్వాత గ్రాఫిక్స్ ప్రాధాన్యం ఉన్న సినిమాను చేయబోనని చెప్పారు. ఇప్పుడు RRR సినిమాకు చాలా గ్రాఫిక్స్ అవసరం.. మళ్లీ ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్నను జర్నలిస్టు అడుగగా.. ఈ చిత్రానికి కూడా గ్రాఫిక్స్ చాలా అవసరం. తప్పడం లేదు. కుక్క తోక వంకర కదా అంటూ సెటైర్ వేసుకొన్నారు.

    ఆర్నెళ్లపాటు గ్రాఫిక్ వర్క్ చేస్తాం

    ఆర్నెళ్లపాటు గ్రాఫిక్ వర్క్ చేస్తాం

    RRR సినిమాను డిసెంబర్, జనవరి వరకు తెరకెక్కిస్తాం. అప్పటి నుంచి ఆర్నెళ్లపాటు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతుంది. నేచురల్ లుక్‌ను క్రియేట్ చేయడానికి, నాచురాలిటీని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. విజువల్ ఎఫెక్ట్‌లో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి చాలా గడువు పెట్టుకొన్నాం అని రాజమౌళి అన్నారు.

    ఆర్ఆర్ఆర్' రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రెస్ మీట్, గుడ్‌లక్ చెప్పిన ఉపాసన!ఆర్ఆర్ఆర్' రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రెస్ మీట్, గుడ్‌లక్ చెప్పిన ఉపాసన!

     నాపై ఎలాంటి ఒత్తిడి లేదు

    నాపై ఎలాంటి ఒత్తిడి లేదు

    బాహుబలి సినిమా ఘనవిజయం తర్వాత నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. నేను ఎప్పుడూ ఒత్తిడికి గురికాను. ఈ సినిమా విషయంలోను నేను ఏమాత్రం ప్రెజర్‌గా ఫీల్ కావడం లేదు. నాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకోవడాన్ని బలంగా భావిస్తాను. నాపై ఎక్స్‌పెక్టేషన్ పెరిగినందుకు చాలా ఆనందంగా ఉంది.

    రాంచరణ్, ఎన్టీఆర్ ఒప్పుకోకపోతే

    రాంచరణ్, ఎన్టీఆర్ ఒప్పుకోకపోతే

    RRR కథ విన్న తర్వాత ఎన్టీఆర్, రాంచరణ్ ఏ ఒక్కరు చేయడానికి ముందుకు రాకపోయినా ఈ సినిమా ఉండేది కాదు. మరో కథ గురించి ఆలోచించే వాడిని. ఎన్టీఆర్, చెర్రీ ఒప్పుకోవడం వల్లే ఈ సినిమా సాధ్యపడింది. అలా ఈ సినిమా ముందుకు పోతున్నది అని రాజమౌళి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

    English summary
    RRR movies official press conference held on Thursday, not only did the director make an official announcement of her signing the film but also revealed how it happened and explained about VFX work.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X