రోబో ఫైట్స్ నభూతో.. ఒక్క ఫైట్‌కు 12 కోట్లు.. షూట్ ఎలా అంటే..
రోబో 2.0 చిత్రానికి సంబంధించి ఉత్కంఠకు గురిచేసే పోరాట సన్నివేశాలను ముంబైలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ ఫైట్స్‌ను అడ్రెనలైన్ పంపింగ్ హై ఆక్టేన్ ఏరియల్ స్టంట్ విధానంలో చిత్రీకరించడానికి ఏర్పాట్లు చే
సంచలన దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న రోబో 2.0 చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు బయటకు వస్తున్న విషయాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే హాలీవుడ్‌తో పాటు పలు సినీ పరిశ్రమల దృష్టి కేంద్రీకృతమైంది. ఈ చిత్రం ఇటీవల చెన్నైలో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకొని తాజాగా ముంబైకి చేరుకొన్నది.

ఉత్కంఠకు గురిచేసే విధంగా పోరాటాలు
ముంబైలో ఉత్కంఠకు గురిచేసే పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. చిత్ర హీరో రజనీకాంత్, విలన్ అక్షయ్ కుమార్ మధ్య జరిగే ఫైట్స్‌ను నభూతో నభవిష్యత్‌గా చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది. ఈ ఫైట్స్‌ను అడ్రెనలైన్ పంపింగ్ హై ఆక్టేన్ ఏరియల్ స్టంట్ విధానంలో చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు బాలీవుడ్ వర్గాల కథనం.

ఒక్క ఫైటు సీన్‌కే రూ.12 కోట్లు
అత్యంత సాంకేతిక పరిఙ్ఞానంతో తీస్తున్న ఈ స్టంట్స్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ఒకే ఒక పోరాట సన్నివేశానికి దాదాపు రూ.12 కోట్ల వెచ్చించనున్నట్టు చిత్ర యూనిట్ పేర్కొన్నది. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం హాలీవుడ్ నుంచి స్టంట్ మాస్టర్లు వచ్చినట్టు సమాచారం.

ఊహకు అందని విధంగా ఫైట్స్
‘ఊహకు అందని విధంగా యాక్షన్ సీన్లు, ఫైట్స్ చిత్రీకరించాలని శంకర్ చెప్పాడు. హాలీవుడ్ చిత్రాలను తలదన్నెలా సీన్లు ఉండాలని కోరాడు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాం' అని చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు.

ఏప్రిల్ 14న టీజర్ విడుదల
ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకొంటున్న రోబో 2.0 మూవీ టీజర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాడులో జరుపుకొనే పుథండు నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని ఈ టీజర్‌ను ఏప్రిల్ 14న విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం భారీ ఫంక్షన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తున్నది. ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్టు రమేశ్ బాలా ట్వీట్ చేసి తెలిపారు.



Click it and Unblock the Notifications











