»   » రామ్ చరణ్ ‘తుఫాన్’ : ఆ సీన్ కోసం 2 కోట్లు

రామ్ చరణ్ ‘తుఫాన్’ : ఆ సీన్ కోసం 2 కోట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'జంజీర్' చిత్రం సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులో 'తుఫాన్' పేరుతో ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సినిమాలో ఓ యాక్షన్ సీన్ చిత్రీకరణ కోసం నిర్మాతలు దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

సినిమాకు హైలెట్‌గా నిలిచే సీన్ చిత్రీకరణ కోసం ఏడు కెమెరాలు ఉపయోగించడంతో పాటు ఫిల్మ్ సిటీలో భారీ సెట్టింగ్ వేసారని, ఇందులో దాదాపు 2వేల వరకు గుడిసెలు ఉన్నాయని, భారీగా సంఖ్యలో కార్లను ఉపయోగించారని తెలుస్తోంది. ముంబైలోని ధారావి స్లమ్‌ ఏరియాను తలపించే విధంగా ఈ సెట్ ఉంటుందట. ఈ సీన్ చిత్రకరణలో 120 ఫైటర్లతో పాటు, 300 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారని తెలుస్తోంది. ఇంత ఖర్చు పెట్టి తీసిన ఈ సీన్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి కలిగిస్తుందో చూడాలి.

Toofan

రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. వాస్తవానికి ఈచిత్రం వేసవిలోనే విడుదల కావాల్సి ఉండగా ఈ చిత్ర నిర్మాతలు న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కోవడంతో సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రానికి సంబంధించిన లీగల్ సమస్యలు ఓ కొలిక్కి రావడంతో సినిమాను సెప్టెంబర్ 06న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Toofan

'జంజీర్' ఎవరూ ఊహించని రేంజిలో రికార్డు స్థాయి రేటుకు అమ్ముడు పోయింది. ఈచిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ రూ. 105 కోట్లు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్‌ సినిమాలకు తెలుగులో దాదాపు రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసే స్టామినా ఉండటం, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనే ఆయన సినిమాలకు మంచి మార్కెట్ ఉండటంతో పాటు, హిందీ మార్కెట్లో 'జంజీర్' చిత్రం అవలీలగా 80 కోట్లపైగానే వసూలు చేసే అవకాశం ఉండటంతో వంద కోట్లకు పైగా భారీ మొత్తానికి వెచ్చింది జంజీర్ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రిలయన్స్ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో జంజీర్ చిత్రాన్ని 'తుఫాన్' పేరుతో, మళయాలంలో 'ముంబై కా హీరో' పేరుతో విడుదల చేస్తున్నారు.

English summary
Rs 2 crore for one scene in 'Zanjeer'. The producers of Apoorva Lakhia’s next claim to have spent almost Rs 2 crore for an action-packed scene in the film. Zanjeer is an upcoming Indian action film directed by Apoorva Lakhia, shot simultaneously in Hindi and Telugu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu