»   » బాహుబలి 2 మీద అనుష్క వేసిన "భారం" 20 కోట్లా ?

బాహుబలి 2 మీద అనుష్క వేసిన "భారం" 20 కోట్లా ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒక హీరోయిన్ కార‌ణంగా నిర్మాత‌ల‌కు ఏకంగా రూ.20కోట్లు లాస్ అయిందనుకోండి అప్పుదు సిట్యువేషన్ ఎలా ఉంటుందీ మహా అయితే ఒక హీరోయిన్ రెమ్యునరేషన్ కోటి వరకూ ఉండోచ్చు టాప్ హీరోయిన్ అయితే రెండు నుంచీ మూడు కోట్లు, కానీ ఆమె కారణం గా 20 కోట్లు అదనం గా ఖర్చుపెట్టాల్సి వచ్చిందట బాహుబలి 2 నిర్మాతలకి, ఆమె అంటే ఎవరో అర్థమయ్యింది కదా అనుష్కనే... ఇంతకీ ఏం జరిగిందీ అంటే...

'బాహుబలి' పార్ట్‌-1లో అనుష్క సన్నగా, అందంగా ఉంది. అప్పుడు ఆమెతో రెండో భాగానికి సంబంధించి చాలా సన్నివేశాలను షూట్‌ చేశారు. ఇదంతా రెండు సంవత్సరాలనాటి మాట. ఇప్పుడు అనుష్క బరువు బాగా పెరిగిపోయింది. ఆమెతో ఇప్పుడు మిగిలిన భాగం షూట్‌ చేయిస్తే మొదటి భాగమప్పుడు చేసిన షూటింగ్‌కీ, ఇప్పటి షూటింగ్‌కి తేడా స్పష్టంగా కనిపిస్తోందట.

Rs 20 Crores Spent For Anushka's Look in Baahubali 2

ఇది సినిమా విజయం మీద దెబ్బతీస్తుందన్న భావనతో మొదటి పార్టులో షూట్‌ చేసిన సన్నివేశాలన్నింటిని దర్శకుడు రాజమౌళి రీ షూట్‌ చేయించారట! ఇలా చేసినందుకు అదనంగా 20 కోట్లు ఖర్చు అవుతాయని తెలిసినా రాజమౌళి కాంప్రమైజ్‌ కాలేదని సినీ జనాలు అంటున్నారు.

దీంతో.. మ‌ళ్లీ షూట్ అంటే టైంతో పాటు.. ఖ‌ర్చు కూడా భారీగా అయ్యే ప‌రిస్థితి. అయిన‌ప్ప‌టికీ వెన‌క్కి త‌గ్గ‌లేద‌ట‌. స్విటీ బొద్దుత‌నం పుణ్య‌మా అని బాహుబ‌లి నిర్మాత‌ల‌కు ఏకంగా రూ.20కోట్లు లాస్ అని చెబున్నారు. అయిన‌ప్ప‌టికీ క్వాలిటీ విష‌యంలో కంట్రోల్ కాకూడ‌ద‌ని డిసైడ్ అయ్యార‌ట‌. దీంతో.. ఫ‌స్ట్ పార్ట్ స‌మ‌యంలో తీసిన సెండ్‌హాఫ్‌లో స్వీటీ స‌న్నివేశాల్ని తీసేసి.. ఫ్రెష్ గా రీషూట్ చేశార‌ట‌. ఇందుకోసం రూ.20కోట్ల మేర భారం ప‌డింద‌ని చెబుతున్నారు.

English summary
Bahubali team has spent 20 crores on Anushka not for the costumes but for her look.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu