»   »  సత్య సాయిబాబా జీవితంపై సినిమా

సత్య సాయిబాబా జీవితంపై సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu
Satya Saibaba
ఎందరిచేతో ఆరాధింపబడుతున్న సత్యసాయిబాబా జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా నిర్మాణం కానుంది. బాలీవుడ్ నోటెడ్ అస్ట్రాలజర్ దీపక్ పండిట్ ఈ సినిమాని ఐదుకోట్లుతో నిర్మిస్తున్నారు. సత్యసాయిబాబాని పుటపర్తిలో దర్శించుకున్న ఈయన ఈ విషయం మీడియా తో చెబుతూ...ఇప్పటికి ఒక్క సినిమాకూడా బాబా జీవితంపై రాకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏవో ఒకటి రెండు టీవీ సీరియల్స్ లో ఆయన మహిమలు కొద్దిగా చూపారు.

కానీ సత్యసాయిబాబా చిన్నప్పటినుంచీ ప్రాంరంభమై ఆధ్యాత్మిక గురువు గా మారటాన్ని ఎవరూ తీయలేదు. నేను దాన్ని రాజీవ్ కండెవాల్ అనే దర్శకుడుతో ఈ ప్రయత్నం చేయబోతున్నాను. ఎస్.ఎస్. శంకర్ అనే సంగీతదర్శకుడు ఈ చిత్రానికి స్వరాలు కూర్చపోతున్నాడు. ఈ చిత్రాన్ని మొదట తెలుగు,హిందీ భాషల్లో నిర్మిస్తాము. తర్వాత భారతీయ భాషలన్నిటిలోకి దీన్ని డబ్ చేస్తాము. బాబాగా కనపడే నటుడు కోసం అన్వేషణ జరుగుతోంది. అది పూర్తయిన వెంటనే మేం మా ముహూర్తాన్ని చేస్తాము. బాబా ఆశీస్సులు మాకుంటాయి అంటూ చెప్పుకొచ్చారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X