twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    The Kashmir Files షో నిలిపివేత.. మేనేజర్ కారణమంటూ రచ్చ.. అసలు ఏమైందంటే?

    |

    దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన 'ది కాశ్మీర్ ఫైల్స్' కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే నోయిడాలోని సెక్టార్ 38 A GIP మాల్ లో షో నడుస్తున్న క్రమంలో షో మధ్యలో నిలిపివేయడంతో మంగళవారం అర్ధరాత్రి హిందూ సంస్థలు రచ్చ సృష్టించాయి. థియేటర్ నిర్వాహకుడు సినిమాను మధ్యలో ఆపేసినట్లు ప్రజలు ఆరోపించారు. అయితే విచారణలో ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అసలు ఏమైంది? ఎందుకు షో మధ్యలో నిలిపివేశారు అనే వివరాల్లోకి వెళితే

    సినిమా మధ్యలో

    సినిమా మధ్యలో

    నోయిడాలోని జిఐపి మాల్ థియేటర్‌లో 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా ప్రదర్శింపబడుతోంది. అది నైట్ షో కాగా హఠాత్తుగా సినిమా మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత సినిమా చూసేందుకు వచ్చిన కొందరు హిందూ సంస్థలకు చెందిన వ్యక్తులు హాల్లో రచ్చ చేయడం ప్రారంభించారు. థియేటర్ మేనేజర్ అజాజ్ ఖాన్ కావాలనే సినిమాను మధ్యలో నిలిపివేశారని ఆరోపించారు. దీంతో రంగంలోకి దిగిన హిందూ సంస్థలు గందరగోళం సృష్టించాయి. ఈ గొడవ పై సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు.

    కొత్త సినిమాపై ఆసక్తిగా

    కొత్త సినిమాపై ఆసక్తిగా

    అనంతరం ఎలాగోలా వివరించి ప్రజలను శాంతింపజేశారు. ఈ విషయమై ఏడీసీపీ రణ్‌విజయ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. జీఐపీ మాల్‌లో జరిగిన గొడవ సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు. కాశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాను మధ్యలో కొంతసేపు నిలిపివేశారని ఆరోపించారు కానీ సాంకేతిక కారణాల వల్ల సినిమా ఆగిపోయిందని విచారణలో తేలింది. హాలులో ఏర్పాటు చేసిన ఏసీలో లోపం తలెత్తడంతో కొంత సేపు సినిమా ఆగిపోయిందని అన్నారు.

    'ది కాశ్మీర్ ఫైల్స్'

    'ది కాశ్మీర్ ఫైల్స్'

    నోయిడాలోని ఓ సినిమా హాల్‌లో 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా ప్రదర్శనకు కొంతసేపు అంతరాయం ఏర్పడడంతో గందరగోళం నెలకొంది. ప్రేక్షకులను శాంతింపజేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఏసీ ఫెయిల్యూర్ కారణంగా సినిమాను మధ్యలో ఆపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఆడిటోరియంలో సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ (ఎసి)లో కొంత లోపం కారణంగా, సిబ్బంది సినిమా ప్రదర్శనను నిలిపివేయవలసి వచ్చింది.

    కొత్త సినిమాపై ఆసక్తిగా

    కొత్త సినిమాపై ఆసక్తిగా

    దీంతో ప్రేక్షకులు గందరగోళం సృష్టించారని పోలీసు అధికారులు బుధవారం తెలిపారు. సెక్టార్ -39 పోలీస్ స్టేషన్ పరిధిలో షాపింగ్ మాల్ లోపల ఉన్న మల్టీప్లెక్స్ నిర్వాహకులు వెంటనే ఏసీని సరి చేశారని, ఆ తర్వాత సినిమా ప్రదర్శనను పునఃప్రారంభించామని ఆయన చెప్పారు. ఏసీ పరికరాల్లో కొంత సమస్య ఉందని వెల్లడించారు. థియేటర్ కిక్కిరిసిపోయి ఉండడంతో మంగళవారం వాతావరణం కాస్త వెచ్చగా ఉందని, అయితే ప్రేక్షకులు కూడా కొత్త సినిమాపై ఆసక్తిగా ఉన్నారు.

    Recommended Video

    The Kashmir Files ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా PM Modi ప్రశంసలు Tax సైతం మినహాయింపు | Oneindia Telugu
    మల్టీప్లెక్స్ మేనేజర్

    మల్టీప్లెక్స్ మేనేజర్

    స్క్రీనింగ్ నిలిచిపోవడంతో గందరగోళం నెలకొంది. మైనారిటీ వర్గానికి చెందిన మల్టీప్లెక్స్ మేనేజర్ సినిమా ప్రదర్శనను ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలను పోలీసులు ఖండించారు. ఇక వివేక్ అగ్నిహోత్రి రచించి, దర్శకత్వం వహించిన కాశ్మీర్ ఫైల్స్ ను జీ స్టూడియోతో కలిసి అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. 1990లలో కాశ్మీరీ పండిట్ల వలసల గురించి సినిమాను నిర్మించారు.

    English summary
    Ruckus at Noida GIP multiplex as The Kashmir Files screening disrupted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X