»   »  ‘రుద్రమదేవి’ ఆడియో లాంచ్ (వీడియో)

‘రుద్రమదేవి’ ఆడియో లాంచ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా స్వీయదర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘రుద్రమదేవి'. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని గ్రాండ్‌గా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియోను వినూత్నంగా రెండు ప్రాంతాల్లో విడుదల చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రుద్రమదేవి పాటల్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు.

ఈ నెల 21 వ తేదీ శనివారం ఉగాది పర్వదినాన విశాఖపట్టణం ఎమ్.జిఎం పార్క్ బీచ్ లో సాయింత్రం ఏడు గంటలకు జరిగే ఉత్సవంలోనూ, ఆ మరుసటి రోజు 22 వ తేదీ ఆదివారం వరంగల్ లోని ఫోర్ట్ వరంగల్ ప్రాంగాణంలో సాయింత్రం 7గంటలకు జరిగే వేడుకలోనూ చేరోచోట రుద్రమదేవి చిత్రంలోని మూడు పాటలు చొప్పున ఆరుగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ ఆడియో లాంచ్ ప్రోమోని టీమ్ వదిలింది. ఈ ప్రోమోపై ఓ లుక్ వేయండి.ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ రెండు వేదికలపై రెండు వేడుకలుగా పబ్లిక్ పంక్షన్స్ గా ఆయా ప్రాంతాల ప్రజల మధ్య జరుపుకోనున్నాయి. రెండు చోట్లా కూడా ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొనబోతున్నారు. ఈ సందర్బంగా దర్శక,నిర్మాత గుణశేఖర్..విశాఖపట్టణం,వరంగల్ లోని ప్రజల్ని ఈ వేడుకకు ఆహ్వానిస్తూ ఈ ప్రకటన చేసారు.


పూర్తి వివరాల్లోకి వెళితే..


ఈ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగే దానికి ఏపీ సీఎం చంద్రబాబును, అలాగే తెలంగాణలో జరిగే ఆడియో వేడుకకు ఆ రాష్ట్రా ముఖ్యమంత్రి కేసీఆర్‌లను ఆహ్వానిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఇద్దరి అపాయింట్ మెంట్ కోసం గుణశేఖర్ వెయిట్ చేస్తున్నారు. అయితే వారు ఈ ఆడియో వేడుకకు వస్తారా రారా అనే విషయంలో క్లారిటీ లేదు. గుణశేఖర్ మాత్రం ఇద్దరు చంద్రుల్ని ఎలాగైనా ఒప్పించి ఆడియో లాంచ్ కార్యక్రమానికి తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని వినికిడి.


Rudhramadevi‬ Audio Launch Promo!

ఇక దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్‌ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రియల్ 24న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్స్ కు చెప్పినట్లు తెలుస్తోంది. తెలుగు,తమిళ,మళయాళ వెర్షన్ లు సైతం ఇదే రోజున విడుదల చేస్తారు.


దాదాపు 45 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో తనకే సాధ్యమైన రీతిలో ఎవరూ వంక పెట్టలేని విధంగా రూపొందించాలని గుణ శేఖర్ కష్టపడుతున్నారు. బిజినెస్ కూడా అదే రేంజిలో జరుగుతుందని భావిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎంట్రీ కలవటం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.


దర్శుడు మాట్లాడుతూ... ''కాకతీయుల కాలం నాటి వైభవాన్ని కళ్లకు కట్టేలా ఈ సెట్‌లు ఉండబోతున్నాయి. వీటి కోసం తోట తరణి 400 స్కెచ్‌లు వేశారు. నాటి సంప్రదాయలు, జీవన స్థితిగతులను ప్రతిబింబించేలా చిత్రబృందం ఎంతో శ్రమించి వీటికి రూపు తీసుకొస్తోంది. ఇప్పటికే కొన్ని సెట్‌లలో షూటింగ్‌ చేశాం. మిగిలిన వాటిలో త్వరలోనే చిత్రీకరణ జరుపుతాం'' అన్నారు.


రాణీ రుద్రమది ఓ అద్భుతమైన ప్రయాణం. ప్రపంచ చరిత్రలో ఆమె స్థానం పదిలం. ఈ తరానికి ఆమె కథ తెలియాలి. సాధ్యమైనంత వరకూ చరిత్రను వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సాంకేతికంగా ఈ సినిమాని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం. అనుష్క కెరీర్‌లో అత్యుత్తమ చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది . రాణీ రుద్రమ కదనరంగంలోనే కాకుండా కళా రంగంలోనే గొప్ప కళాకారిణి అని, కత్తిపట్టినా, కాళ్ళకు గజ్జె కట్టినా ఆమెకు సాటి ఆమేనని ఈ చిత్రంలో దర్శకుడు తెలియజేయనున్నాడు.


అమ్మాయిలంటే అందాల రాశులే కాదు, వీరనారీలు కూడా. ప్రేమ, కరుణ విషయంలో సున్నితమనస్కులే. కానీ శత్రు సంహారం చేయాల్సినప్పుడు అపరకాళీ అవతారం ఎత్తుతారు. రుద్రమదేవి కథ కూడా అలాంటిదే. రుద్రమదేవి తెగువ, ధైర్యం స్త్రీ జాతికే గర్వకారణం. ఆమె సాహసాలకు మేం తెర రూపం ఇస్తున్నాం అంటున్నారు గుణశేఖర్‌.


భారత చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ‘రుద్రమదేవి' చిత్రాన్ని రూపొందించాలన్న పట్టుదలతో ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఇంటర్నేషనల్ స్టాండర్స్‌తో తీస్తున్నామని దర్శకుడు గుణశేఖర్ చెప్పుకొచ్చారు.


ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది. తెలుగుజాతి గర్వించే కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టే సినిమా ఇది. దేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో ‘రుద్రమదేవి'ని తెరకెక్కించాలన్నదే నా లక్ష్యం. అందుకే ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అంటున్నారు గుణశేఖర్.


ఈ చిత్రంలో రాణీ రుద్రమగా....అనుష్క, చాళుక్య వీరభద్రునిగా.... రానా, గణపతిదేవునిగా.... కృష్ణంరాజు, శివదేవయ్యగా... ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా.... సుమన్, మురారిదేవునిగా... ఆదిత్యమీనన్, నాగదేవునిగా.... బాబా సెహగల్, కన్నాంబికగా.... నటాలియాకౌర్, ముమ్మడమ్మగా.... ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా.... హంసానందిని, అంబదేవునిగా.... జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా.... అదితి చంగప్ప, కోటారెడ్డిగా.... ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..... వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా .....అజయ్ కనిపించనున్నారు.


ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

English summary
Rudhramadevi‬ Audio Launch Promo! Check it out. Finally, Gunasekhar has come out of the cocoon to confirm the audio release dates of “Rudramadevi". On 21st March, at Park Beach Hotel in Visakhapatnam, the audio of “Rudramadevi" will be unveiled. Second audio launch function will be held on March 22nd at Fort Comlex in Warangal. Maestro Ilayaraja has scored music for the flick, while Thota Tharani is the art director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu