»   » ‘రుద్రమ దేవి’ సీడెట్ రైట్స్ రికార్డు ధరకు...

‘రుద్రమ దేవి’ సీడెట్ రైట్స్ రికార్డు ధరకు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనుష్క టైటిల్ రోల్‌లో గుణ టీమ్ వర్క్స్ పతాకంపై శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో గుణశేఖర్ రూపొందుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి చిత్రం 'రుద్రమదేవి'. ఈ చిత్రంలోని గోన గన్నారెడ్డి పాత్రను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోషిస్తున్నారు.

అనుష్క, అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం విడుదల ముందు నుండే మంచి బిజినెస్ చేస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం సీడెడ్ రైట్స్ ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన ఎన్.వి.ప్రసాద్ రూ. 6 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈచిత్రం హైదరాబాద్ శివారులోని గోపనపల్లిలో వేసిన సెట్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌తో పాటు అనుష్క, రానా, ప్రకాష్ రాజ్, కృష్ణం రాజు, హంసా నందిని ఇంకా చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటున్నారు. గోన గన్నారెడ్డి అల్లు అర్జున్ సరసన నటిస్తున్న కేథరిన్ నటిస్తోంది.

Rudhramadevi's Ceded rights Rs.6 crores

జులై 4న ప్రారంభమైన ఈ షెడ్యూల్ 40 రోజుల పాటు సాగుతుంది. ఈ షెడ్యూల్ పూర్తయితే సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లే. అల్లు అర్జున్ నటిస్తున్న సన్నివేశాలను చాలా లావిష్‌గా హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందిస్తున్నారు. డిసెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏకధాటిగా షూటింగ్ జరుపుతున్నారు.

ఈ మూవీలో ఇంకా నిత్యా మీనన్, ప్రభ, జయప్రకాష్ రెడ్డి, ఆదిత్య మీనన్, ప్రసాదాదిత్య, అజయ్, విజయ్ కుమార్, వేణు మాధవ్, ఉత్తేజ్, వెన్నెల కిషోర్, కృష్ణ భగవాన్, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, శివాజీ రాజా, సమ్మెట గాంధీ, అదితి చెంగప్ప, సన, రక్ష తదితరులు నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మేస్ట్రో ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రఫీ: అజయ్ విన్సెంట్, కాస్ట్యూమ్ డిజూనర్: నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, వి.ఎఫ్.ఎక్స్ సూపర్ వైజర్: కమల్ కణ్ణన్, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఫైట్స్: విజయ్, కాస్ట్యూమ్స్: వి.సాయి బాబు, మేకప్: రాంబాబు, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె.రామ్ గోపాల్, సమర్పణ: శ్రీమతి రాగిణీ గుణ, కథ-స్ర్కీన్ ప్లే-నిర్మాత-దర్శకత్వం: గుణశేఖర్.

English summary
The latest we heard is that the Ceded area's rights of Rudhramadevi movie have been sold out to NV Prasad for a hefty price of Rs.6 crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu