»   » భారీ ధరకు ‘రుద్రమదేవి’ శాటి లైట్‌రైట్స్

భారీ ధరకు ‘రుద్రమదేవి’ శాటి లైట్‌రైట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనుష్క టైటిల్ రోల్‌లో అల్లు అర్జున్, రానా ముఖ్య పాత్రల్లో నటించిన ‘రుద్రమదేవి' చిత్రం శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయి. తాజాదా అందుతున్న సమాచారం ప్రకారం ఓ ప్రముఖ టీవీ ఛానల్ రూ. 8.5 కోట్లకు ఈ చిత్ర రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 70 కోట్లపెట్టుబడితో ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ చిత్రం కావడం, అనుష్క, అల్లు అర్జున్, రానా నటిస్తుండటం వల్లే ఇంత రేటు వచ్చినట్లు తెలుస్తోంది.

గుణశేఖర్ దాదాపు 9 సంవత్సరాలు రీసర్చ్ చేసి తెరకెక్కించిన పీరియాడికల్ సినిమా ఇది. ఇండియాలోనే మొట్టమొదటి సారిగా గుణశేఖర్ స్టీరియో స్కోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్న హిస్టారికల్ 3డి మూవీ ఇది. గత సంవత్సరం డిసెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి చివరి వారంలో సినిమా విడుదల కానుంది.

Rudhramadevi Satellite Rights

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
కాగా ఇలాంటి సంచలన చిత్రం ఆడియో కూడా ఎప్పటికి నిలిచి పోవాలని ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా తో మ్యూజిక్ చేయించారు దర్శకుడు గుణశేఖర్. ఈ ఆడియో ను దక్కించుకోవాలని టాప్ ఆడియో సంస్థలన్ని ప్రయత్నించాయి. చివరకు ఈ చిత్రానికి సంబందించిన ఆడియో హక్కులను హైయ్యెస్ట్ ఫాన్సీ రేట్ ఇచ్చి ప్రముఖ ఆడియో సంస్థ లహరి మ్యూజిక్ దక్కించుకుంది.

ఈ సందర్భంగా ఆడియో అధినేత జి. మనోహర్ నాయుడు మాట్లాడుతూ....‘ఈ ఏడాది ప్రారంభం లో మా సంస్థ ద్వార విడుదల అయిన ‘గోపాల గోపాల' తెలుగు ఆడియో లో టాప్ పోజిషన్ లో వుంది. మా ఆడియో ఆల్బంలలో ఇళయరాజా గారి సినిమాలు పాటలు చాల వున్నాయి. ఇప్పటికి అవి వినబడుతున్నా...., తర తారలు గుర్తుండి పోయేలా ‘రుద్రమదేవి' చిత్రం లాంటి ఆడియో కూడా ఆయనే చేయడంతో ఎంత రేట్ అయిన ఈ సినిమా దక్కించుకోవాలని మంచి ఫాన్సీ రేట్ ఇచ్చి కొన్నాము' అన్నారు.

సినిమా అడ్వాన్సు క్వాలిటీ కాబట్టి, మేము ఆడియో పరంగా ఇచ్చే హై క్వాలిటీ నచ్చి ఎప్పుడు క్వాలిటీ విషయం లో కాంప్ర్ మైజ్ కాని గుణశేఖర్ మాకే ఈ ఆడియో రైట్స్ ఇచ్చారు. ఆయనకు ధన్యవాదాలు. ఆయన నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయకుండా మంచి క్వాలిటీ తో ఫిబ్రవరి చివరి వారంలో ఆడియో రిలీజ్ చేస్తాము' అన్నారు అనుష్క, రానా ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

English summary
The satellite rights of Anushka Shetty-starrer ‘Rudhramadevi’ have been sold for a bomb. It is reliably learnt that a leading entertainment channel has spent Rs 8.5 crore for the television rights of the Rs 70 crore period drama that also sees Allu Arjun and Rana Daggubati in key roles.
Please Wait while comments are loading...