»   » హాట్ టాపిక్: ‘రుద్రమదేవి’ రొమాంటిక్ యాంగిల్!

హాట్ టాపిక్: ‘రుద్రమదేవి’ రొమాంటిక్ యాంగిల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 13వ శతాబ్ధపు వీరనారి రాణి రుద్రమదేవి జీవితాన్ని 'రుద్రమదేవి' టైటిల్ తో తెరకెక్కిస్తున్నాడు గుణశేఖర్ ఈ చిత్రంలో ఆమె వీరత్వాన్ని మాత్రమే కాదు....రొమాంటిక్ యాంగిల్ కూడా తెరపై ఆవిష్కరించాడట. ‘ఔనా నీవేనా' సాంగ్ ట్రైలర్ విడుదలైనప్పటి నుండి ఈ విషయం హాట్ టాపిక్ అయింది. అయినా సినిమా మొత్తం పోరాట సన్నివేశాలు ఉంటే ప్రేక్షకులు బోర్ ఫీలవుతారని మధ్యలో రీలీప్ కోసం ఇలాంటి రొమాంటిక్ సాంగ్ జొప్పించారట. మరి ఈ సాంగ్ సినిమాకు ప్లస్పవుతుందో? లేదో? చూడాలి.

ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుక శనివారం విశాఖలో జరిగింది. ఈ సందర్భగా సినిమా కోసం తను పడ్డ కష్టాన్ని చెబుతూ ఎమోషన్ అయ్యారు గుణశేఖర్. సినిమా కోసం రూ. 70 కోట్లు ఖర్చు పెట్టినట్లు గుణశేఖర్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం తెలుగు సినిమాకు ఉన్న మార్కెట్ దృష్ట్యా రూ. 70 కోట్లు అంటే మాటలు కాదు. తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న సినిమాలకు సైతం ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తం ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ఎన్నో ఏళ్లుగా తను కలలు కన్న రుద్రమదేవి చిత్రాన్ని తెరకెక్కించడానికి గుణశేఖర్ స్వయంగా నిర్మాతగా మారి ఇంత పెద్ద మొత్తం ఖర్చు పెట్టడం గొప్పవిషయమే.


అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈచిత్రంలో గోన‌గన్నారెడ్డిగా అల్లు అర్జున్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. రానా ముఖ్యమైన పాత్ర పోషించారు. రాణీ రుద్రమది ఓ అద్భుతమైన ప్రయాణం. ప్రపంచ చరిత్రలో ఆమె స్థానం పదిలం. ఈ తరానికి ఆమె కథ తెలియాలి. సాధ్యమైనంత వరకూ చరిత్రను వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సాంకేతికంగా ఈ సినిమాని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం. అనుష్క కెరీర్‌లో అత్యుత్తమ చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది . రాణీ రుద్రమ కదనరంగంలోనే కాకుండా కళా రంగంలోనే గొప్ప కళాకారిణి అని, కత్తిపట్టినా, కాళ్ళకు గజ్జె కట్టినా ఆమెకు సాటి ఆమేనని ఈ చిత్రంలో దర్శకుడు తెలియజేయనున్నాడు.


Rudhramadevi Songs Trailer - Auna Neevena Song

అమ్మాయిలంటే అందాల రాశులే కాదు, వీరనారీలు కూడా. ప్రేమ, కరుణ విషయంలో సున్నితమనస్కులే. కానీ శత్రు సంహారం చేయాల్సినప్పుడు అపరకాళీ అవతారం ఎత్తుతారు. రుద్రమదేవి కథ కూడా అలాంటిదే. రుద్రమదేవి తెగువ, ధైర్యం స్త్రీ జాతికే గర్వకారణం. ఆమె సాహసాలకు మేం తెర రూపం ఇస్తున్నాం అంటున్నారు గుణశేఖర్‌.


భారత చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ‘రుద్రమదేవి' చిత్రాన్ని రూపొందించాలన్న పట్టుదలతో ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఇంటర్నేషనల్ స్టాండర్స్‌తో తీస్తున్నామని దర్శకుడు గుణశేఖర్ చెప్పుకొచ్చారు. సినిమాలో అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్ర సినిమాకు హైలెట్ కానుంది.


ఈ చిత్రంలో రాణీ రుద్రమగా....అనుష్క, చాళుక్య వీరభద్రునిగా.... రానా, గణపతిదేవునిగా.... కృష్ణంరాజు, శివదేవయ్యగా... ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా.... సుమన్, మురారిదేవునిగా... ఆదిత్యమీనన్, నాగదేవునిగా.... బాబా సెహగల్, కన్నాంబికగా.... నటాలియాకౌర్, ముమ్మడమ్మగా....నిత్యామీనన్, మదనికగా.... హంసానందిని, అంబదేవునిగా.... జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా.... అదితి చంగప్ప, కోటారెడ్డిగా.... ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..... వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా .....అజయ్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

English summary
Watch Rudhramadevi "Aunaa Neevena" Song Promo. Rudhramadevi movie Written, Produced and Directed by Gunasekhar.
Please Wait while comments are loading...